Share News

AP NEWS: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం .. ఏంటంటే..

ABN , Publish Date - Dec 31 , 2024 | 03:23 PM

Lanka Dinakar: నదుల అనుసంధానంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కృష్ణా నదిలో ఆ స్థాయిలో నీటి లభ్యత కష్టంగా మారిందని చెప్పారు. ఈ తరుణంలో వెలిగొండ వరకు నదుల అనుసంధానం చేయడం ద్వారా 23 లక్షల మందికి తాగు నీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని అన్నారు.

AP NEWS: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం .. ఏంటంటే..
Lanka Dinakar

అమరావతి: నదుల అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో సాగు, తాగు నీటికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. కొత్త సంవత్సరానికి ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీలో “ నదుల అనుసంధానం“ పై తీపి కబురు చెప్పారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. 2019 - 24 మధ్య నదుల అనుసంధానం కోసం కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక సార్లు నదుల అనుసంధానం గురించి అడిగితే, రాష్ట్రంలో నాటి జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి గోదావరి జలాలపైన డ్రామాలు ఆడి సమయం వృథా చేశారని ఆరోపించారు. నదుల అనుసంధానం ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ విధానమని ఏపీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. నదుల అనుసంధానంలో నీటిని నిలువ చేసే రిజర్వాయర్లు అత్యంత ప్రాధాన్యమైందని చెప్పారు. వీటి ద్వారా రాష్ట్రంలో తాగునీరు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో రాష్ట్రాన్ని శాశ్వతంగా కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నదుల అనుసంధానంతో అపర భగీరథునిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రతిపాదిత నదుల అనుసంధానాన్ని వెలిగొండకు అనుసంధానం చేయడం ద్వారా పశ్చిమ ప్రకాశం కరువుకు శాశ్వతంగా పరిష్కరించవచ్చని అన్నారు. గోదావరి - కృష్ణ - పెన్నా నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలతో పాటు, ముఖ్యంగా బొల్లపల్లి మీదుగా 53.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ( 42.85 టీఎంసీల వినియోగిత సామర్థ్యం ) ఉన్న వెలిగొండ ప్రాజెక్టును ఎప్పుడు నీటి నిలువ ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను అతి పెద్ద రిజర్వాయర్‌గా వినియోగించడం ద్వారా పూర్తి పశ్చిమ ప్రకాశం జిల్లాను, కడప జిల్లాలోని బద్వేల్, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి - ఆత్మకూరులను శాశ్వతంగా కరువు కోరల్లో నుంచి బయట పడవేయవచ్చని చెప్పారు.


ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ వద్ద 267 మీటర్లు ఎత్తులో నీరు ఉన్నప్పుడు మాత్రమే వెలిగొండ ప్రాజెక్టు కోసం నీరు గ్రావిటీ ద్వారా విడుదల అవుతుందన్నారు. అంత నీరు శ్రీశైలంలో లేనప్పుడు నీటి విడుదల సాధ్యపడదని చెప్పారు. కృష్ణా నదిలో ఆ స్థాయిలో నీటి లభ్యత కష్టంగా మారిన తరుణంలో వెలిగొండ వరకు నదుల అనుసంధానం చేయడం ద్వారా 23 లక్షల మందికి తాగు నీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని అన్నారు. దీంతోపాటు పారిశ్రామికంగా నీటి వినియోగానికి, ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలోని ఫ్లోరెడ్ పీడిత ప్రాంతాలకు సురక్షిత నీటిని అందించవచ్చని తెలిపారు. ఇలా చేయడం ద్వారా శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. రాష్ట్రంలో నదుల అనుసంధానానికి చెందిన డీపీఆర్‌లో నదుల మధ్య ఉండే నీటి పారుదల కాలువలతో పాటు, ప్యూహాత్మక ప్రదేశాల్లో స్టోరేజ్ రిజర్వాయర్లు, కాలువలు, రిజర్వాయర్లకు సమీప పరిసర గ్రామాలు, పట్టణాల్లో నీటికి ఇబ్బంది ఉండదని అన్నారు. ఇందుకు సంబంధించి నీటి సంరక్షణ కోసం ఇంకుడు బావులు భారీగా చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నదుల అనుసంధానం ప్రాజెక్టు విజయవంతం అవుతుందని చెప్పారు. ఇలా చేయడం వల్ల ప్రజల మనసులో చెరగని ముద్ర వేయడం ఖాయమని లంకా దినకర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivasa Rao: మంత్రుల మార్పుపై.. పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

AP High Court: పేర్నినానికి హైకోర్టులో స్వల్ప ఊరట

AP News: చిత్తూరు జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ

AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 03:25 PM