Pawan Kalyan: వైసీపీ అధినేత జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ABN , Publish Date - Nov 09 , 2024 | 08:23 PM
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఇటీవల మీడియా నిర్వహించి ఏపీ పోలీసులను బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. తమను అరెస్టులు చేస్తే సప్త సముద్రాలు దాటి వచ్చి పగ తీర్చుకుంటామని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వారి కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెడుతున్న వారిని ఆయన సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్టు చేస్తే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామనేలా జగన్ మాటలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్పరేషన్ ఛైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో ఫ్యాన్ పార్టీ అధినేతపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
పోలీసులను బెదిరిస్తారా?
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. " ఏపీ పోలీస్ వ్యవస్థను మాజీ సీఎం జగన్ బెదిరిస్తున్నారు. గత ముఖ్యమంత్రి ఇటీవల మీడియా సమావేశంలో పోలీసులను బెదిరిస్తున్న తీరును మనమంతా చూశాం. తమను అరెస్టులు చేస్తే సప్త సముద్రాలు దాటి వచ్చి పగ తీర్చుకుంటామన్నట్లు మాట్లాడుతున్నారు. ఇది కచ్చితంగా పోలీస్ వ్యవస్థను బెదిరించడమే. సోషల్ మీడియాలోనైనా, మీడియా ముఖంగానైనా పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి. మీరు( జనసేన కార్పరేషన్ ఛైర్మన్లు) మాత్రం ఇష్టానుసారం సబ్జెక్టు లేకుండా వారిలా మాట్లాడొద్దు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఎక్కడా మాట మీరకుండా ముందుకు వెళ్లండి.
CM Chandrababu: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
సబ్జెక్టుపైనే మాట్లాడండి..
వైసీపీ నేతలు పాలసీలపై మాట్లాడరు, కేవలం వివాదాలే కావాలి. మీరు మాత్రం పాలసీల మీద, పాలసీలపైనే చర్చలు చేయండి. అంతేగాని తప్పుడు వ్యాఖ్యలు చేయెుద్దు. ముఖ్యంగా ఇళ్లల్లో ఉన్న మహిళలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయెుద్దు. సబ్జెక్టుపై చాలా బలంగా మాట్లాడండి. ఏ సమస్య ఉన్నా నా పేషీ దృష్టికి తీసుకురండి. ఆ సమస్య పరిష్కారం అయ్యేలా తప్పనిసరిగా కృషి చేద్దాం. వైసీపీ నేతల్లా నీచంగా మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించండి. తప్పు చేసిన వారిని నాయకుడే సమర్థిస్తుంటే నేతలు, కార్యకర్తలు అలా కాక ఇంకెలా తయారవుతారు. నాయకుడు అనే వాడు తప్పు చేసింది తమ వారే అయినా శిక్షించాలి. అలా కాకుండా వారే ప్రోత్సహిస్తే అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు" అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ముగిసిన చంద్రబాబు సీ ప్లేన్ పర్యటన..
AP News: రెచ్చిపోతున్న కామాంధులు.. ఏపీలో మరో దారుణం..
Read Latest AP News And Telangana News