Palnadu: ఘోరం.. కొండగట్టు ఆలయానికి వెళ్లి వస్తుండగా..
ABN , Publish Date - Dec 08 , 2024 | 08:26 AM
శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కారు కొనుగోలు చేసింది. నూతన కారు కావడంతో పూజలు చేయించేందుకు ఆ కుటుంబానికి చెందిన 8 మంది తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు.
పిగుడురాళ్ల: పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఓ కుటుంబం కొండగట్టు (Kondagattu) ఆలయానికి వెళ్లి వస్తుండగా దారుణం జరిగింది. బ్రాహ్మణపల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కొత్త కారు కొన్న సంతోషంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్లి చివరకు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈ దారుణ ఉద్దంతం బాధిత కుటుంబంలో తీవ్రవిషాదం మిగిల్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కారు కొనుగోలు చేసింది. నూతన కారు కావడంతో పూజలు చేయించేందుకు ఆ కుటుంబానికి చెందిన 8 మంది తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. ఆలయానికి చేరుకుని దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే పల్నాడు జిల్లా బ్రహ్మణపల్లి గ్రామం అద్దంకి-నార్కట్‌పల్లి హైవే గీతికా స్కూల్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
ప్రమాదంలో సురేశ్, వనిత, యోగులు, వేంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఒకేసారి నలుగురి మృతితో సిరిపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Health News: లోబీపీ ఉన్నవారికి ఎన్ని అనర్ధాలు జరుగుతాయో తెలుసా..
Gajwel: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..