Pawan Kalyan: వప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Oct 28 , 2024 | 09:59 PM
చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో ఇటీవల చిరుత పులిని చంపిన నిందితులను మూడు రోజుల్లో పట్టుకుని రిమాండ్‌కు తరలించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లాలో అరుదైన జంతువును చంపిన నిందితులను రోజుల వ్యవధిలో అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అమరావతి: వన్యప్రాణులను వేటాడటం, అటవీ సంపదను నాశనం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) అటవీ శాఖ యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్‌ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... వన్యప్రాణుల సంరక్షణకు ట్రోల్ ఫ్రీ నెంబర్- 18004255909 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణులను వేటాడటం... చంపడం... అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబమని ఉద్ఘాటించారు. భూమ్మీద మనతో పాటు మనుగడ సాధిస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదుల పట్ల కరుణ చూపాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వాటికి మనలాగే బతికే హక్కు ఉందని తెలిపారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్య ప్రాణులను వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయడం నిషేధమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో ఇటీవల చిరుత పులిని చంపిన నిందితులను మూడు రోజుల్లో పట్టుకుని రిమాండ్‌కు తరలించామని పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లాలో అరుదైన జంతువును చంపిన నిందితులను రోజుల వ్యవధిలో అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, చంపినా, అక్రమ రవాణాకు పాల్పడినా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం 18004255909 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. అటవీ సంపదను నాశనం చేసినా, అక్రమ మైనింగ్‌కు పాల్పడిన అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Bomb Threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో విమానానికి..
AP Govt: ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో కీలక నిర్ణయం .. నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు
Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే
Read Latest AP News And Telugu News