Share News

AP politics: మాచర్ల అల్లర్ల కేసులో సీఐ నారాయణస్వామిపై వేటు..

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:48 PM

కారంపూడి సీఐ నారాయణస్వామి(CI Narayana Swamy)పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. నారాయణస్వామిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కారంపూడిలో సీఐ నారాయణస్వామి శాంత్రిభద్రతలు కాపాడటంలో విఫలమయ్యారని, తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఏపీ హైకోర్టు(AP High Court)ను పిన్నెల్లి ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సీఐను విధులకు దూరంగా ఉంచాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించారు. దీంతో సీఐ నారాయణస్వామిని విధుల నుంచి ఈసీ తప్పించింది.

AP politics: మాచర్ల అల్లర్ల కేసులో సీఐ నారాయణస్వామిపై వేటు..
CEO Mukesh Kumar Meena

అమరావతి: కారంపూడి సీఐ నారాయణస్వామి(CI Narayana Swamy)పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. నారాయణస్వామిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల రోజు(మే 13) మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. అయితే కారంపూడిలో సీఐ నారాయణస్వామి శాంత్రిభద్రతలు కాపాడటంలో విఫలమయ్యారని, తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఏపీ హైకోర్టు(AP High Court)ను పిన్నెల్లి ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సీఐను విధులకు దూరంగా ఉంచాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించారు. దీంతో సీఐ నారాయణస్వామిని విధుల నుంచి ఈసీ తప్పించింది.


పిన్నెల్లి చర్యలేవీ..!

సీఐ నారాయణస్వామిని విధుల నుంచి తప్పించడంపై పలువురు తెదేపా నేతలు పెదవి విరుస్తున్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేసి వీడియోతో సహా అడ్డంగా దొరికిన పిన్నెల్లిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.. కానీ అధికారులపై వేటు వేస్తూ వారిని బలి చేస్తున్నారన్నారు. ఘర్షణలపై సిట్ విచారణ అనంతరం తిరుపతి, పల్నాడు, అనంతపురం ఎస్పీలు, కలెక్టర్లు, ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు సీఐ నారాయణస్వామిపైనా వేటు వేశారన్నారు. కానీ రామకృష్ణారెడ్డి అరెస్టుకు మాత్రం ఆదేశాలు ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ తెదేపా కార్యకర్త, బాధితుడు నంబూరి శేషగిరిరావు పెద్ద యుద్ధమే చేస్తున్నారన్నారు. హైకోర్టులో న్యాయం జరగలేదంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రామకృష్ణారెడ్డికి భయపడి తాను హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారని శేషగిరిరావు చెప్తున్నారు. పిన్నెల్లి అరెస్టు చేస్తేనే నియోజకవర్గంలో పరిస్థితులు కుదుటపడతాయని లేదంటే.. ఎన్నికల కౌంటింగ్ రోజు పెద్దఎత్తున అల్లర్లు జరుగుతాయని శేషగిరిరావు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Gas leak: ఏర్పేడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్.. బాధితులు ఎంతమందంటే..?

AP politics: కుప్పం నియోజకవర్గంలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 04:48 PM