Nara Lokesh: కూటమి విజయంపై నారా లోకేశ్‌కు అభినందనల వెల్లువ..
ABN , Publish Date - Jun 05 , 2024 | 02:14 PM
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో టీడీపీ, జనసేన, బీజీపీ కూటమి(Kutami) భారీ విజయంతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. 39ఏళ్ల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధించడంపైనా నారా లోకేశ్(Nara Lokesh)పై అభినందల వర్షం కురుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో టీడీపీ, జనసేన, బీజీపీ కూటమి(Kutami) భారీ విజయంతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. 39ఏళ్ల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధించడంపైనా నారా లోకేశ్(Nara Lokesh)పై అభినందల వర్షం కురుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూటమి జోషు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం పలువురు కూటమి గెలుపునకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెదేపా నేతలు కేశినేని చిన్ని, ధూళిపాళ్ల నరేంద్ర, గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, తదితర నేతలు లోకేశ్‌ను కలిసి కూటమి విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. విజయానికి గల కారణాలను నేతలతో లోకేశ్ పంచుకున్నారు. ప్రజలు మనపై గురుతరమైన బాధ్యత ఉంచారని, గెలుపొందిన ప్రతీ ఎమ్మెల్యే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని లోకేశ్ వారికి సూచించారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ప్రధానంగా పల్నాడులో మంచినీటి సమస్య, కర్నూలు లాంటి జిల్లాల్లో వలసలు నివారణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోవాలన్నారు. ఈ మేరకు గెలుపొందిన ప్రతీ ఎమ్మెల్యే కష్టపడి పని చేసి పార్టీలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు లోకేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
ఇవి కూడా చదవండి:
AP politics: కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో కొంతమంది ఉన్నతాధికారుల్లో గుబులు..
Crime news: పరవాడలో ఏటీఎం చోరీ.. ఎంత నగదు ఎత్తుకెళ్లారంటే..?
AP Politics: ఏపీ అసెంబ్లీ ఫలితాలపై జనసేన నేత నాగబాబు స్పందన..