Share News

Atchannaidu: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jul 12 , 2024 | 05:45 PM

వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు నేడు ఏపీ సచివాలయంలో (Kinjarapu Atchannaidu) బాధ్యతలు స్వీకరించారు.

 Atchannaidu: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న  కీలక నిర్ణయాలు
Kinjarapu Atchannaidu

అమరావతి: వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు నేడు ఏపీ సచివాలయంలో (Kinjarapu Atchannaidu) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖామంత్రిగా నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 62శాతం మంది 3.02 కోట్ల మంది వ్యవసాయం, వ్యవసాయ అనుభంద రంగాలపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్థక, డెయిరీ డెవలెప్మెంట్, మత్స్య శాఖలను తనకు చంద్రబాబు నాయుడు అప్పగించారని అన్నారు. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వమైన అత్యంత ప్రాధాన్యమైనదిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.


2019 నుంచి 2024 వరకూ ఈ రాష్ట్రాన్ని పాలించిన జగన్ రెడ్డి ఈ శాఖకు తాళం వేశారని అన్నారు. వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యం కలిగింది భూమి కాబట్టి భూసారాన్ని ప్రభుత్వం ఎప్పటి కప్పడు పరీక్ష చేయలేదని చెప్పారు. గడచిన ఐదేళ్లలో ఒక్క భూసార పరీక్ష కూడా చేయలేదని చెప్పారు. విత్తనాలు, ఎరువులు లేవు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని అన్నారు. పంట అమ్ముకుంటే ఐదారు మాసాలకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలోని ప్రతి రైతు ధైర్యంగా ఉంటారని అన్నారు. ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత వరకూ ఆ సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ వ్యవసాయ అనుభంద రంగాలకు ఎలాంటి కార్యక్రమాలు చేశారో అవన్ని మళ్లీ పునప్రారంభించామని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అందులో భాగంగానే మూడు డిపార్ట్‌మెంట్లలో 6 ఫైళ్లపై సంతకం చేశానని వివరించారు.


వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తోంది... ఈ కార్యక్రమాన్ని 23 వ తేదీన రాష్ట్రం మొత్తం మీద ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ అధికారులు, ప్రజాప్రతినిధులు పొలాల దగ్గరకు వెళ్లి రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరారు. ఖరీఫ్‌, రబీలో నాలుగు మాసాల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండోసంతకం రైతుకు వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు అందిచడంపై చేశామని వివరించారు. గత ఐదు సంవత్సరాల్లో యాంత్రీకరణ అనేమాటే ఈ రాష్ట్రంలో వినింపిచలేదని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.988 కోట్లు ఖర్చు పెట్టి వ్యక్తిగతంగా సబ్సిడీపై యాంత్రీకరణను ప్రోత్సహించామని చెప్పారు. ఈ ఐదేళ్లలో చివరకు కొడవలి పిడి కూడా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Jul 12 , 2024 | 05:45 PM