CM Chandrababu: 3 నగరాల్లో కార్యకలాపాలు
ABN , Publish Date - Sep 28 , 2024 | 08:45 PM
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు లులూ గ్రూప్ సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో లులూ ప్రణాళికలపై చర్చించామని అన్నారు. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ ఆలీతో చర్చలు సఫలం అయ్యాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అమరావతి: ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి లులూ గ్రూప్ సిద్ధమైంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. లులూ గ్రూప్‌ను ఏపీకి సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. లులూ గ్రూప్ రాష్ట్రానికి తిరిగివచ్చినందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు లులూ గ్రూప్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందజేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో లులూ ప్రణాళికలపై చర్చించామని అన్నారు. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ ఆలీతో చర్చలు సఫలం అయ్యాయని సీఎం చంద్రబాబు చెప్పారు. వైజాగ్‌లో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.
ALSO READ: Minister Dola: జగన్ డిక్లరేషన్ ఇవ్వలేకే తిరుమల పర్యటన రద్దు: మంత్రి డోలా..
చేనేతకు చేయూత ఇవ్వాలి: నారా భువనేశ్వరి
చేనేతకు చేయూత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొందామని సూచించారు. పండుగ రోజుల్లో వాటిని ధరిద్దామని పిలుపునిచ్చారు. నులిపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేతలు మరింత ఆనందంగా పండుగలు చేసుకునేలా చేద్దామని నారా భువనేశ్వరి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Somireddy: అలా చేస్తే భారతమ్మ ఇంట్లోకి రానీయదా.. జగన్‌కు సూటి ప్రశ్న
Kollu Ravindra: జగన్ తిరుమల పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే
Anitha: జగన్‌ను పులికేశితో పోలుస్తూ అనిత సెటైర్...
Read Latest AP News And Telugu News