Share News

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. సీఎస్ ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - Jul 13 , 2024 | 06:56 PM

ఏపీలో ఐపీఎస్‌ల‌ను ప్రభుత్వం భారీగా బదిలీ చేసింది. మొత్తం 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ‌ఆర్టీ నంబర్ 1252 జారీ చేశారు.

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. సీఎస్ ఉత్తర్వులు జారీ

అమరావతి: ఏపీలో ఐపీఎస్‌ (IPS) ల‌ను ప్రభుత్వం భారీగా బదిలీ చేసింది. మొత్తం 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Nirab Kumar Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ‌ఆర్టీ నంబర్ 1252 జారీ చేశారు. పాలనలో ప్రక్షాళన తీసుకురావడానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( CM Nara Chandrababu Naidu) చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బదిలీలు చేపట్టారు. చర్యల్లో భాగంగా ఇప్పటికే ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు (శనివారం) 37 మంది ఐపీఎస్‌లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి: YS Sharmila: నేను ఆ నినాదంతో క్యాంపెయిన్ చేయలేదా.. వైసీపీకి షర్మిల సవాల్

బదిలీ అయిన అధికారుల వివరాలిలా..

  • కేవీ మహేశ్వరరెడ్డిని శ్రీకాకుళం జిల్లా ఎస్సీగా బదిలీ

  • వకుల్ జిందాల్‌ను విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ

  • ఎం దీపికాను అనకాపల్లి ఎస్పీగా బదిలీ

  • వి. రత్నను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ

  • ఎస్వీ మాధవ్ రెడ్డిని పార్వతీపురం ఎస్పీగా బదిలీ

  • విక్రాంత్ పాటిల్‌ను కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ

  • ఏపీ ఏస్పీ కాకినాడ మూడో బెటాలియన్ కామాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు

  • ఎస్ సతీష్ కుమార్‌ను గుంటూరు జిల్లా ఎస్పీగా బదిలీ

  • అమిత్ బర్ధర్‌ను అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్సీగా బదిలీ

  • తుహిన్ సిన్హాను విశాఖపట్నం సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా బదిలీ

  • డి . నరసింహా కిషోర్‌ను ఎస్పీ ఈస్ట్ గోదావరికి బదిలీ

  • వి. విద్యాసాగర్ నాయుడును ఎస్సీగా అన్నమయ్య జిల్లాకు బదిలీ

  • బి. కృష్ణారావును ఎస్పీగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదిలీ

  • ఆర్. గంగాధర్ రావును కృష్ణాజిల్లా ఎస్పీగా బదిలీ

  • అద్నాన్ నయీం అస్మీని ఎస్పీగా పశ్చిమ గోదావరి జల్లాకు బదిలీ

  • అజితా వేజెండ్లను విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసు వన్‌గా బదిలీ

  • కె. ప్రతాప్ శివకిషోర్‌ను ఎస్పీగా ఏలూరు జిల్లాకు బదిలీ

  • కె.శ్రీనివాసరావును పల్నాడు జిల్లా ఎస్పీగా బదిలీ

  • మల్లికా గార్గ్‌ను ఏపీ ఎస్పీ 5వ బెటాలియన్ విజయనగరంకు బదిలీ

  • ఏఆర్ దామోదర్‌ను ప్రకాశం జిల్లా ఎస్పీగా బదిలీ

  • జి. బింద్ మాదవ్‌ను కర్నూలు జిల్లా ఎస్పీగా బదిలీ

  • జి.కృష్ణకాంత్‌ను నెల్లూరు జిల్లా ఎస్పీగా బదిలీ

  • అదిరాజ్ సింగ్ రాణాను నంద్యాల జిల్లా ఎస్పీగా బదిలీ

  • వి.హర్షవర్దన్ రాజును వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా బదిలీ

  • కేవీ. మురళి కృష్ణను అనంతపురం ఎస్పీగా బదిలీ

  • గౌతమి శాలిని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సీపీ లా అండ్ ఆర్డర్ వన్‌గా బదిలీ

  • ఎల్. సుబ్బరాయుడును తిరుపతి ఎస్పీగా బదిలీ. ఆయనకే ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు

  • వి. గీతికాదేవిని ఇంటలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా బదిలీ

  • జీఆర్. రాధికాను డీజీపీ ఆఫీసులో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రిపోర్ట్ చేయాలని ఆదేశం.

  • డీ. మేరి ప్రశాంతిని డీజీపీ ఆఫీసులో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రిపోర్ట్ చేయాలని ఆదేశం.

  • కె. ఆరీఫ్ హఫీస్‌, కె. రఘువీరారెడ్డి, సిద్దార్ద్ కౌశల్, సుమిత్ సునీల్‌, పీ. జగదీష్‌, ఎస్ శ్రీధర్, ఎం. సత్తిబాబులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశం.

    ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 1252ను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు.


null

ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu : ‘నా కాళ్లకు దండం పెట్టొద్దు’.. ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

Mastan Vali: షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారు.. వైసీపీ నేతలకు మస్తాన్ వలి వార్నింగ్

Budda Venkanna: నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే... తాచుపాము జగన్

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. సీఎస్ ఉత్తర్వులు జారీ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 08:00 PM