Share News

Lokesh: 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం..

ABN , Publish Date - Aug 16 , 2024 | 09:39 AM

Andhrapradesh: రాష్ట్రంలో అన్న క్యాంటీన్‌లు నిన్న(గురువారం) పున:ప్రారంభమయ్యాయి. ఈ సందర్భం మంత్రి నారా లోకేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2019 సెప్టెంబర్ వైసీపీ కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం అని చెప్పారన్నారు.

Lokesh: 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం..
Minister Nara Lokesh

గుంటూరు, ఆగస్టు 16: రాష్ట్రంలో అన్న క్యాంటీన్‌లు నిన్న(గురువారం) పున:ప్రారంభమయ్యాయి. ఈ సందర్భం మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2019 సెప్టెంబర్ వైసీపీ కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం అని చెప్పారన్నారు. అయితే సర్వే ర్యాలీలో జగన్ రెడ్డి ఫోటో వెయ్యడానికి వేల కోట్లు ఖర్చు చేశారని..

AP Politics: జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!


అలాంటిది అన్న క్యాంటీన్లకు నిధులు లేవు అని చెప్పారని మండిపడ్డారు. రూ. 200 కోట్లతో అన్న క్యాంటీన్లను నడపించవచ్చారు. సర్వే రాళ్ళ కోసం ఖర్చు చేసిన డబ్బుతో 3 ఏళ్లు అన్న క్యాంటీన్లు నడిపించచ్చన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారన్నారు. పేద ప్రజల కోసం ఎవరు పని చేస్తున్నారు అనేది ప్రజలు పరిశీలించాలని తెలిపారు. మంగళగిరి నియోజవర్గం చేనేత వర్గాలకు జీఎస్టీ తొలగింపుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


కాగా.. స్వాతంత్ర్యదినోత్సవం రోజు గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి స్వయంగా పేదవారికి అన్నం వడ్డించారు. అనంతరం సీఎం దంపతులు కూడా అక్కడే భోజనం చేశారు. నిన్న ఈ పథకానికి సీఎం శ్రీకారం చుట్టగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. నెల్లూరు, గుంటూరు, తెనాలి, ఏలూరులో జిల్లాలో అన్న క్యాంటీన్లు పండుగలా ప్రారంభమయ్యాయి. మరోవైపు అన్న క్యాంటీన్‌లకు విరాళాలందించే విషయంలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించే నిమిత్తం పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు, వృద్ధులు సైతం తరలి వచ్చి విరాళాలిస్తున్నారు. బుధవారం ఒక్క రోజే రూ.2 కోట్లకుపైగా విరాళాలు అందాయి.

KTR: మహిళలపై ఇబ్బందికర వ్యాఖ్యలు.. విచారం వ్యక్తం చేసిన కేటీఆర్


వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు విరాళాలిచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో అన్న క్యాంటీన్ల నిర్వహణ చూస్తున్న మున్సిపల్‌శాఖ విరాళాలు తీసుకునేందుకు బ్యాంక్‌ ఖాతా వివరాలను ప్రకటించింది. విరాళాలు పంపించాలనుకునేవారు ఆ ఖాతాకు నేరుగా ఆన్‌లైన్‌ విధానంలో లేదా చెక్‌ రాసి పంపవచ్చని తెలిపింది. అన్న క్యాంటీన్స్‌, అకౌంట్‌ నెంబరు 37818165097కు గుంటూరు చంద్రమౌళినగర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు చెందేలా జమచేయవచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ 0020541 నంబరుకు నగదు పంపవచ్చని తెలిపింది. గురువారం గుడివాడలో జరిగిన అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఖాతా వివరాలు ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో ఒక స్ఫూర్తినింపేలా అన్న క్యాంటీన్ల నిర్వహణ ఉంటుందని సీఎం చెప్పారు.


ఇవి కూడా చదవండి..

AP Politics: జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

CM Revanth Reddy: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏం జరగబోతోంది?

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 16 , 2024 | 09:50 AM