Share News

Nara Lokesh: నా చిన్నప్పుడు అలా ఉండేది.. మంత్రి నారా లోకేష్ ఆసక్తికర విషయాలు

ABN , Publish Date - Dec 07 , 2024 | 02:03 PM

ఏపీ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తన చిన్ననాటి పాఠశాల రోజులు గుర్తుకు వచ్చాయని అన్నారు. బాపట్ల మున్సిపల్‌ పాఠశాలలో పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం జరిగింది. బాపట్లలో మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు.

Nara Lokesh: నా చిన్నప్పుడు అలా ఉండేది.. మంత్రి నారా లోకేష్ ఆసక్తికర విషయాలు

బాపట్ల: ఏపీ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తన చిన్ననాటి పాఠశాల రోజులు ఇప్పుడు గుర్తుకు వచ్చాయని అన్నారు. బాపట్ల మున్సిపల్‌ పాఠశాలలో ఇవాళ(శనివారం) పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం జరిగింది. బాపట్లలో మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో చంద్రబాబు, లోకేష్ ముఖామఖి నిర్వహించారు.


పాఠశాలలకు రేటింగ్స్..

‘‘మా అమ్మ మా స్కూలు టీచర్ పేరెంట్స్ మీటింగ్‌కు వస్తే నాన్న రాష్ట్రానికే మాష్టారుగా ఉన్నారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో పీటీఎం ఏర్పాటు చేశాం. పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు, టీచర్స్ సమీక్షించాలని అన్నారు. పాఠశాలలకు రేటింగ్స్ ఇచ్చాం. ప్రొగ్రెస్ కార్డుతో పాటు హెల్త్ కార్డ్ ఇస్తున్నాం. గతంలోనే స్మార్ట్ క్లాసెస్ తీసుకువచ్చాం. దారి తప్పిన విద్యావ్యవస్థను గాడిలో పెడుతున్నాం. గతంలో పార్టీ రంగులు, రాజకీయ నాయకుల ఫొటోలు ఉండేవి. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం.16300 టీచర్ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ఇచ్చాం. వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. పిల్లలను పిడుగుల్లా తయారు చేస్తాం. అమ్మాయి, అబ్బాయి ఇద్దరిని సమంగా చూడాలి. డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. .ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సూచనలతో నైతిక విలువలపై పాఠాలు తయారు చేయబోతున్నాం. డ్రగ్స్ , గంజాయి వల్ల ఒక తరం నాశనమైంది. ఈగల్ పేరుతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం. అన్ని పాఠశాలలను 4th స్టార్ రేటింగ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. ఉపాధ్యాయులు, టీచర్స్ సహకారం కావాలి’’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP: వైసీపీ కీలక నేత అరెస్ట్.. ఎందుకంటే

AP High Court : గంజాయి కేసుల్లో ఇదేం తీరు?

CBI : ‘కంటెయినర్‌లో డ్రగ్స్‌’ కథ కంచికి!?

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 02:16 PM