Share News

Minister Nimmala Ramanaidu: జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం.... మంత్రి నిమ్మల ధ్వజం

ABN , Publish Date - Oct 25 , 2024 | 05:52 PM

ఏపీవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్‌లలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.

Minister Nimmala Ramanaidu:  జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం.... మంత్రి నిమ్మల ధ్వజం

అమరావతి: జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల గేట్లు, షట్టర్లు , రోప్స్‌కు గ్రీజు వంటి వాటికి మరమ్మతులు మాట అటుంచి కనీసం గ్రీజు వంటి నిర్వహణ కూడా లేక ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం అయిపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. విజయవాడ ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల సీఈ, ఎస్ఈలతో ఇవాళ(శుక్రవారం) మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులు , రిజర్వాయర్లు, కాలువల అత్యవసర పనుల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన రూ. 284 కోట్లతో వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఏపీవ్యాప్తంగా ప్రాజెక్ట్‌లలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల ఆపరేషన్, నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ.983 కోట్లు ఖర్చు పెట్టాల్సిఉండగా, వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అధికారులు తెలిపారు.


ఈ ఏడాదికి అవసరమైన రూ. 983 కోట్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారని అన్నారు. పంట కాలువలు, డ్రైన్లు, రిజర్వాయర్లు నిర్వహణకు అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ మేనేజ్‌మెంట్ పద్ధతిన తీసుకోవాలని సీఎం సూచించారని అన్నారు. జగన్ ప్రభుత్వ అసమర్థ విధానాలు, నిర్వహణా లోపాల కారణంగా, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 467 లిఫ్ట్ స్కీంలు మూలన పడ్డాయని, ఈ కారణంగా 2.90 లక్షల ఎకరాల సాగు తగ్గిందని అధికారులు వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న 8.11 లక్షల ఎకరాల సాగుకు అవసరమైన 1047 ఎత్తిపోతల పథకాల నిర్వహణ, రిపేర్ల కోసం పదేళ్లకు యాన్యుటీ పద్ధతిన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Kandula Durgesh: త్వరలోనే నూతన టూరిజం పాలసీ

AP Govt: విజయవాడ వరద బాధితులకు పరిహారం విడుదల..

AP Politics: మరీ ఇలా అయితే ఎలా జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 25 , 2024 | 06:00 PM