Minister Ramanaidu: వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్
ABN , Publish Date - Jun 13 , 2024 | 08:02 PM
వలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్ అందిస్తామని అన్నారు. వలంటీర్లతో రాజీనామా చేయించి జగన్ రోడ్డున పడేశారని మండిపడ్డారు.
అమరావతి: వలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వలంటీర్లతో రాజీనామా చేయించి జగన్ రోడ్డున పడేశారని మండిపడ్డారు.ఈ రోజు(గురువారం) ఏపీ సచివాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు కేబినెట్ మంత్రులు తొలి అధికారిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడుమాట్లాడారు.
ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ఆ యాక్ట్ రద్దు..
‘‘ఏపీ ప్రజల్లో 5 సంతకాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత, భరోసా ఇచ్చారు. డీఎస్సీ మీద మొదటి సంతకం చేస్తామని చెప్పి...ఆ మాట నిలబెట్టుకున్నారు. యువతను గంజాయి డ్రగ్స్‌కు జగన్ బానిసగా చేశారు. ఈ రోజు నిరుద్యోగులకు చంద్రబాబు శుభవార్త తెలిపారు. 16307 పోస్టుల భర్తీకి సంతకం చేశారు. మెగా డీఎస్సీ వేస్తాం, ప్రతి ఏడు వేస్తానని మాజీ సీఎం జగన్ చెప్పి మాట తప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ల్యాండ్, మైన్, సాండ్‌లను గత వైసీపీ ప్రభుత్వం లూటీ చేసింది. వైసీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ప్రజల ఆస్తులను కొల్లగొట్టే పరిస్థితి. అందుకే ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు.రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను చంద్రబాబు రద్దు చేశారు. గత ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది. పెన్షన్ల విషయంలో జగన్ ఎన్నో అబద్ధాలు చెప్పారు. పెన్షన్లపై మూడో సంతకం చేసి రూ.3 వేల నుంచి 4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ పింఛన్లను ఇచ్చేందుకు 3 వ సంతకం పెట్టారు’’ అని నిమ్మల రామానాయుడు తెలిపారు.
పెన్షన్ల కోసం రూ.5000 కోట్లు
‘‘ఈ రాష్ట్రంలో 35 రూపాయలు పెన్షన్‌ను దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారు. రూ. 200 నుంచి రూ. 2000కు గతంలోనే చంద్రబాబు పెంచారు. జగన్ 1000 రూపాయలు 4 సంవత్సరాలకు పెంచారు దీనివల్ల రూ.30 వేల నష్టం కలిగింది. పెన్షన్‌ను ఆయన హయాంలో 2800 రూపాయలు పెంచారు. వృద్ధులు, దివ్యాంగులను రాజకీయాలకు జగన్ వాడుకున్నారు. వారి ప్రాణాలు తీశారు. ఇంటికి పెన్షన్ ఇవ్వకుండా వారిని బలిగొన్నారు. జులై 1వ తేదీన మా ప్రభుత్వంలో 7 వేల రూపాయలు ఇంటి వద్ద పెన్షన్ ఇస్తాం. 4వ సంతకం అన్న క్యాంటీన్లు ఏపీలో ఏర్పాటు చేశారు. రోజుకు 3 పూటలా రుచికరమైన భోజనం, టిఫిన్ అందించాలని నిర్ణయించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌ను అక్కడి డీఎంకే ప్రభుత్వం కొనసాగించింది. 5వ సంతకం యువత కోసం స్కిల్ సెన్సెస్ చేయాలని చేశారు. యువతలోని వినూత్న స్కిల్స్ పైన చంద్రబాబు చర్చించారు. అందుకే స్కిల్ సెన్సెస్ కోసం 5వ సంతకం చేశారు. డిపార్ట్మెంట్ వారీగా రివ్యూ చేసి పరిస్థితి తెలుసుకొని శ్వేతపత్రాలు ఇస్తాం. జులై నెల ఒక్క నెలలోనే రూ.5000 కోట్లు పెన్షన్ల కోసం అవసరం అవుతాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి మీటింగ్ చూస్తే ఆ పాలనకు, ఈ పాలనకు తేడా కనిపించింది’’ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం: మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇవ్వలేదని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి (Minister Dola Bala Veeranjaneya Swamy) అన్నారు. గత ప్రభుత్వం యువత గంజాయి, డ్రగ్స్‌తో నిర్వీర్యం అవుతున్న పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడే పాలన ఏర్పడిందని.. ఆ విధానాలు సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పంచాయతీ...గ్రామ, వార్డ్ సచివాలయాల మధ్య ఉన్న ఘర్షణను సరళం చేసి పంచాయతీ సర్పంచ్‌ల గౌరవాన్ని కాపాడుతామని డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
పథకాలు, సంక్షేమం విజనరీ లీడర్ చంద్రబాబుకు తెలుసు: మంత్రి సవిత
అన్న క్యాంటీన్లను బంద్ చేసి పేదలకు భోజనం లేకుండా చేశారని మంత్రి సవిత (Minister Savita) అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ క్యాంటీన్లు ప్రారంభమై పేదల కడుపు నింపుతాయన్నారు. పథకాలు ఇవ్వడం, సంక్షేమం అందించడం కూడా విజనరీ లీడర్ చంద్రబాబుకు తెలుసునని మంత్రి సవిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మొదటి సంతకం ఈ ఫైల్‌పైనే..!
AP News: రాష్ట్రపతి ముర్మును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి .. ఎందుకంటే..?
Read Latest Andhra Pradesh News and Telugu News