AP Assembly: 108పై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. అరబిందోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:45 PM
61 శాతం అంబులెన్స్‌లో సెలైన్ల కొరత ఉండటంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కొరతా ఉన్నట్లు కాగ్ నిర్ధారించిందని అసెంబ్లీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. అరబిందో 430 అంబులెన్స్‌లు నడిపి 720 అన్నట్లు ప్రభుత్వానికి లెక్కలు చూపిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వెల్లడించారు.
అమరావతి: 108 వాహనాల టెండర్, నిర్వహణకు సంబంధించి అరబిందో సంస్థపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రభుత్వాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. 108 మాటున ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని అసెంబ్లీలో సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 18 లక్షల మందికి అంబులెన్స్‌లు అత్యవసర సేవలు అందించలేకపోయాయని ఎమ్మెల్యే వెల్లడించారు. 34 లక్షల మందికి గాను 17.8 లక్షల మందికి గోల్డన్ అవర్ రీచ్ కాలేకపోయాయని ఆడిట్ జనరల్ తప్పుపట్టిన విషయాన్ని సభలో ఆయన చెప్పారు.
Ayyanna Patrudu: ఇదేం పద్ధతి.. అయ్యన్న పాత్రుడు సీరియస్
61 శాతం అంబులెన్స్‌లో సెలైన్ల కొరత ఉండటంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కొరతా ఉన్నట్లు కాగ్ నిర్ధారించిందని అసెంబ్లీలో సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. అరబిందో 430 అంబులెన్స్‌లు నడిపి 720 అన్నట్లు ప్రభుత్వానికి లెక్కలు చూపిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వెల్లడించారు. గత ప్రభుత్వంలో అంబులెన్స్‌లు నిర్వహించిన వారికి చట్టాలు వర్తించవా? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా నరేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Adimulapu Suresh: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి
అయితే అరబిందో సంస్థపై శాసనసభలో సభ్యులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, ధూళిపాళ్ల చేసిన ఆరోపణలు వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకూ అరబిందోకు రూ.600 కోట్ల చెల్లింపులు జరిగాయని, ఇంకా రూ.800 కోట్లు పైచిలుకు చెల్లింపులు చేయాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. అంబులెన్స్‌ల విషయంలో నిర్లక్ష్యంతోపాటు దోపిడీ కూడా జరిగిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో సభకు, ప్రజలకు తెలిజేయాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని అడిగారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ ఆసక్తిని రేకెత్తించింది.
Ayyanna Patrudu: ఇదేం పద్ధతి.. అయ్యన్న పాత్రుడు సీరియస్
ఇదీ విషయం..
వైసీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాల నిర్వహణ బాధ్యతల టెండర్లను అరబిందో సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థపై మెుదట్నుంచీ ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడం, అలాగే ఆ సంస్థకు అప్పటి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో విషయం బయటకు పొక్కలేదు. దీంతో వారు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగింది. ఉద్యోగులకు నెలలపాటు జీతాలు ఇవ్వకుండా వారిని వేధించారు. అలాగే 108 వాహనాల నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి అక్రమాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చింది. దీంతో కాంట్రాక్టు గడువు ఉండగానే.. నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంది.
దీన్ని కూటమి ప్రభుత్వం సైతం ఆమోదించింది. నెలనెలా వేతనాలను ఇవ్వకుండా అరబిందో సంస్థ తమను ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు తమను నట్టేట వదిలేసి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 108 సిబ్బంది. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తేనే వేతనాలు ఇస్తామని ఆ సంస్థ అంటోందని వాపోతున్నారు. మరోవైపు అరబిందో స్థానంలో నిర్వహణ బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో వేతన బకాయిలపై స్పష్టత ఇవ్వాలని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Former Minister Roja: ఏపీలో హిట్లర్, గడాఫి కలిసి పాలన చేస్తున్నట్లు ఉంది: ఆర్కే రోజా..
AP NEWS: సంచలనం సృష్టిస్తున్నవైసీపీ కొత్త స్కాం