YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ
ABN , Publish Date - Nov 23 , 2024 | 01:37 PM
వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి జయ మంగళ వెంకటరమణ ఇవాళ(శనివారం) రాజీనామా చేశారు. అయితే భవిష్యత్తు ప్రణాళికపై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి పారీల్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లుంది. గత ఐదేళ్ల జగన్ పాలన దృష్ట్యా ఏపీలో పార్టీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. అందుకే.. పక్క చూపులు చూస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు. ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో, లేదో కూడా తెలియడం లేదు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలు వైసీపీకి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామాల బాట పట్టనున్నట్లు సమాచారం. తాజాగా జయ మంగళ వెంకటరమణ ఇవాళ(శనివారం) రాజీనామా చేశారు. గత కొంత కాలంగా వైసీపీపై, పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి వైఖరీని బాహాటంగానే నేతలు విమర్శిస్తున్నారు.
ఎమ్మెల్సీ పదవికి జయ మంగళ వెంకటరమణ ఇవాళ(శనివారం) రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌కు జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖ పంపించారు. అయితే భవిష్యత్తు ప్రణాళికపై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి పారీల్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇలా ఎందరో నేతలు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి బట్టి చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవడం ఖాయం అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
ఇప్పట్లో ఆగవేమో..!
ఇదిలా ఉంటే త్వరలోనే మరికొంత మంది నేతలు కూడా రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రాజీనామాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని వైసీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే రాజీనామాలు ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు.