Share News

Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తా

ABN , Publish Date - Oct 07 , 2024 | 11:11 AM

యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తా

అమరావతి: యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇవాళ(సోమవారం) ఏపీ సచివాలయంలో మంత్రి లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.... మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి నారా లోకేష్ గుర్తుచేశారు.


వారికి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప నైవేద్య సాయం రూ.10 వేలకు పెంచినట్లు తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని 5400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని నారా లోకేష్ వెల్లడించారు.


ప్రజా చైతన్యమే ధ్యేయంగా యువగళం ...

కాగా.. యువగళం పాదయాత్ర ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే ధ్యేయంగా ముందుకు సాగింది. లోకేశ్‌ 226 రోజులపాటు 3,132 కిలోమీటర్లు నడిచారు. 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాలు/ మునిసిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా యాత్ర సాగించారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల్లేక నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత ఒకవైపు.. ఇంటి నుంచి బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి వస్తామనే గ్యారెంటీ లేక భయాందోళనలతో బతుకుతున్న మహిళలు మరోవైపు.. అడ్డగోలు ధరల బాదుడుతో బతుకు భారంగా మారిన జనసామాన్యం ఇంకోవైపు.. ఇలా అడుగడుగునా అభద్రతాభావం, నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు తానున్నాను అని నారా లోకేష్ ధైర్యం ఇచ్చారు. మొత్తంగా లోకేష్ 70 బహిరంగసభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, ఎనిమిది రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి 4,353 వినతిపత్రాలు అందుకున్నారు. వివిధ సామాజికవర్గాలు, వృత్తులవారు నేరుగా లోకేశ్‌ను కలుసుకుని కష్టాలు చెప్పుకున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మంది ప్రజలతో నారా లోకేష్ మమేకమయ్యారు.


‘సెల్ఫీ విత్‌ లోకేశ్‌’ ..

సెల్ఫీ చాలెంజ్‌ పేరుతో టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి విజయగాధలు.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించడం.. అదే సమయంలో టీడీపీ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. వినూత్న రీతిలో కేడర్‌కు, ప్రజలకు దగ్గరయ్యేందుకు చేపట్టిన ‘సెల్ఫీ విత్‌ లోకేశ్‌’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో 3.5 లక్షల మందికిపైగా అభిమానులతో లోకేశ్‌ సెల్ఫీలు, ఫొటోలు దిగారు. యువ నేతతో సెల్ఫీలు, ఫొటోలు దిగిన వారికి వాటిని స్కానింగ్‌ చేయించి, ఫేస్‌ రికగ్నషన్‌ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరేలా ఏర్పాటుచేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్‌ చేశారు. పాదయాత్ర వెంబడి తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగానికి లోకేశ్‌ 600కు పైగా లేఖలు రాశారు. పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిన ప్రతిచోటా ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

నేడు ప్రధానితో సీఎం భేటీ

అంగళ్లులో రాళ్ల దాడి.. బాబుపై కేసు తప్పుడుదే!

CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగదు..

Kishan Reddy: గోవా రైలుకు పచ్చజెండా

Read Latest AP NEWS And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 11:45 AM