Share News

Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభంజనం..

ABN , Publish Date - Nov 23 , 2024 | 06:17 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోటా ఎన్డీయే అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. బల్లార్‌పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్‌పూర్, కస్బాపేట్, డెగ్లూర్, లాతూర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్థులను గెలిపించాలంటూ పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు.

Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభంజనం..
AP Deputy CM Pawan Kalyan

అమరావతి: మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం వైపు పరుగులు పెడుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో 230కి పైగా స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ మరోసారి సంచలనంగా మారారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం స్ట్రయిక్ రేట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 21 నియోజకవర్గాల్లో నిలబడిన ప్రతి ఎమ్మెల్యే.. ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి గెలిచారు. దీంతో దేశంలోనే 100 శాతం స్ట్రయిక్ రేట్ నమోదు చేసిన పార్టీగా జనసేన నిలిచింది.

Pawan-Kalyan-4.jpg


తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అదే సీన్ కనిపించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోటా ఎన్డీయే అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. బల్లార్‌పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్‌పూర్, కస్బాపేట్, డెగ్లూర్, లాతూర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్థులను గెలిపించాలంటూ పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. పవన్ బహిరంగ సభలు, రోడ్ షోలకు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పవన్ వెళ్లిన ప్రతి చోటా ఇసుక వేస్తే రాలనంతా జనం హాజరయ్యారు. దీంతో స్థానిక నేతలు, ప్రత్యర్థులు పవన్ క్రేజ్ చూసి షాకయ్యారు.

Pawan-Kalyan-3.jpg


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారంతో మహాయుతి నేతల విజయం తథ్యమని పలువురు రాజకీయ విశ్లేషకులు అప్పుడే భావించారు. అనుకున్నట్లుగా ఆయా నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయమైంది. దీంతో పవన్ మరోసారి 100 శాతం రిజల్ట్ మార్క్ చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో పవన్ స్టార్.. "పవర్" చూపించారని, ఆయన "పంజా" విసిరి ప్రత్యర్థులను చిత్తు చేశారంటూ జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. పవన్ రేంజ్ అంటే ఇదేనంటూ తెగ సంబర పడిపోతున్నారు. కాగా, మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కేవలం 50 స్థానాలకే పరిమితం అయ్యింది.

Pawan-Kalyan-2.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో బీజేపీ కూటమికి భారీ మెజార్టీ..

YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ

Updated Date - Nov 23 , 2024 | 06:28 PM