Share News

Minister Sandhya Rani: గిరిజన మహిళా మంత్రి పట్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం..!

ABN , Publish Date - Jun 17 , 2024 | 07:34 PM

గుమ్మడి సంధ్యారాణి ( Gummadi Sandhya Rani) గిరిజన మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మంత్రి బాధ్యతల స్వీకరణలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మంత్రి పట్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు.

 Minister Sandhya Rani:  గిరిజన మహిళా మంత్రి పట్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం..!
Gummadi Sandhya Rani

అమరావతి: గుమ్మడి సంధ్యారాణి ( Gummadi Sandhya Rani ) గిరిజన మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మంత్రి బాధ్యతల స్వీకరణలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మంత్రి పట్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. బాధ్యతల స్వీకరణకు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక్క అధికారి కూడా హాజరు కాలేదు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సైతం రాకపోవడంతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అవాక్కయ్యారు. తాము రావడం లేదని ఆ శాఖ తరపున ప్రతినిధిని పంపుతున్నట్లు కూడా ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వలేదు.


వీరి వైఖరితో గిరిజన మహిళా మంత్రి నివ్వెరపోయారు. ఒక్క గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, మరళి తదితర ఉన్నతాధికారులు, కొంతమంది జిల్లా అధికారులు మాత్రమే హాజరయ్యారు. సమాచార లోపం వల్లే రాలేకపోయారని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఒంటిగంటకు మంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని ఉదయం 10.30 గంటలకు మీడియాకు సమాచార పౌరసంబంధాల శాఖ సమాచారం ఇచ్చింది.ఈ వ్యవహరంలో జీఏడీ, ఐఎన్ పీఆర్‌ల మధ్య సమన్వయం కొరవడింది. మంత్రులు బాధ్యతల స్వీకరణ వివరాలు గురించి జీఏడీలో సంబంధిత శాఖ ఉద్యోగులు అడిగినా సమాధానం దొరకని పరిస్థితి. నిజానికి మంత్రుల పేషీలను జీఏడీ బాధ్యతలకు సిద్ధం చేయాలి కాని అలా చేయలేదు. మంత్రుల బాధ్యతల స్వీకరణపై జీఏడీ, ఐ అండ్ పీఆర్‌ల మధ్య సమన్వయం కొరవడిందని సంబంధిత శాఖ ఉద్యోగులు చెబుతున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 08:27 PM