Nimmala Ramanaidu: జగన్ ఆ నిధులను దారి మళ్లించారు.. మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Dec 24 , 2024 | 07:08 PM
Nimmala Ramanaidu: జగన్ అధికారంలోకి రాగానే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌లో నిల్వ ఉన్న రూ. 2092 కోట్లను దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్‌ను వ్యవసాయ రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి 72 శాతం పూర్తి చేశామని గుర్తుచేశారు.
పశ్చిమగోదావరి జిల్లా: చెత్తపై పన్ను వేసిన చెత్త పాలన జగన్‌ది అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తాడేపల్లిగూడెంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 1. 67 లక్షలు విలువగల మినీ ట్రాక్టర్లను పంచాయతీలకు మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చెత్తతో సంపద సృష్టించారని చెప్పారు. నాడు వైసీపీ ప్రభుత్వంలో జగన్ సంపద కేంద్రాలను మూసివేసి రాష్ట్రాన్ని 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారని అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌లో నిల్వ ఉన్న రూ. 2092 కోట్లను దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
రైతులకు అండగా ఉంటాం: మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి: కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ రైతు వ్యతిరేక పాలనకు నిరసనగా రైతులకు అండగా అందరం కలసి పోరాడామని తెలిపారు. తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణమండపంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ను వ్యవసాయ రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి 72 శాతం పూర్తి చేశామని గుర్తుచేశారు. రైతులకు హెక్టారుకు రూ. 25 వేలకు పెంచి అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని తెలిపారు. రైతులకు అన్నిరకాలుగా అండగా ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Nadendla Manohar: ఆ చట్టంపై అవగాహన ఉండాలి
Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..
YCP: వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
Minister Nara Lokesh : శ్యామ్ బెనగల్ మృతికి లోకేశ్ సంతాపం
Read Latest AP News And Telugu news