Share News

Sharmila: ఢిల్లీలో పోలవరం, ప్రత్యేక హోదా‌పై జగన్ ధర్నా ఎందుకు చేయలేదు

ABN , Publish Date - Jul 23 , 2024 | 09:31 PM

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి సెటైర్లు గుప్పించారు. వినుకొండ హత్య కేసుపై న్యూట్రల్ మీడియా వారిని తాము అడిగామని.. అలాగే తాము కూడా విచారించామని రషీద్‌తో పాటు చంపిన నిందితుడు కూడా వైసీపీ వాళ్లేనని తేలిందని అన్నారు.

Sharmila: ఢిల్లీలో పోలవరం, ప్రత్యేక హోదా‌పై జగన్  ధర్నా ఎందుకు చేయలేదు
YS Sharmila

విజయవాడ: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి సెటైర్లు గుప్పించారు. వినుకొండ హత్య కేసుపై న్యూట్రల్ మీడియా వారిని అడిగామని.. అలాగే తాము కూడా విచారించామని రషీద్‌తో పాటు చంపిన నిందితుడు కూడా వైసీపీ వాళ్లేనని తేలిందన్నారు. వీరిద్దరూ వైసీపీలో ఉన్నప్పుడే విబేధాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని.. జైలుకు కూడా వెళ్లారని చెప్పారు. ఒకరిపై ఒకరు ఇళ్ల మీదకు వెళ్లి కొట్టుకున్నారని అన్నారు. అక్కడి వైసీపీ ఇన్‌ఛార్జి కూడా ఇరువురి మధ్య పంచాయతీ చేసేందుకు యత్నించారని తెలిపారు.


ఇవన్నీ తమ విచారణలో తేలాయి కాబట్టే.. రాజకీయ హత్య కాదని తాము చెప్పామన్నారు. ఢిల్లీకి వెళ్లి జగన్ ధర్నా చేయడం ఎందుకని నిలదీశారు. కేవలం ఉనికి కోసం, అసెంబ్లీని తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం కోసం ఢిల్లీ వెళ్లి ఎందుకు ధర్నాలు చేయలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్, కడప స్టీల్ ప్లాంట్‌లపై ఎందుకు ధర్నా చేయలేదో జగన్ చెప్పాలని అడిగారు.


వైసీపీ వివాదాన్ని జాతీయ సమస్యగా జగన్ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడ వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు జగన్ ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని చర్చ పెట్టారని చెప్పారు. మరి జగన్ అసెంబ్లీకి వెళ్లి.. ఆ యాక్టుపై తన అభిప్రాయాన్ని చెప్పాలి కదా అని అడిగారు. ఏపీ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేస్తే.. జగన్ వెళ్లి మాట్లాడరా అని ప్రశ్నించారు. ఆ మాత్రం ఇంగితం లేకుండా జగన్‌ మాట్లాడుతున్నారంటే.. ఎవరూ బాగు చేయలేరు.. పూర్తిగా పతనమైపోయారని షర్మిల విమర్శించారు.

Updated Date - Jul 23 , 2024 | 10:31 PM