Share News

AP Politics: ‘ప్రజాగళం’ సభలో పోలీసుల సహాయ నిరాకరణపై కూటమి సీరియస్

ABN , Publish Date - Mar 18 , 2024 | 10:55 AM

Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ‘‘ప్రజాగళం’’ బహిరంగసభలో పోలీసుల సహాయ నిరాకరణపై కూటమిలోని సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నిన్ననే (ఆదివారం) ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సభలో ఎక్కడా పోలీసు కనిపించని అంశాన్ని నేరుగా సభలోనే ప్రధాని ప్రస్తావించారు. కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

AP Politics: ‘ప్రజాగళం’ సభలో పోలీసుల సహాయ నిరాకరణపై కూటమి సీరియస్

అమరావతి, మార్చి 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్న ‘‘ప్రజాగళం’’ బహిరంగసభలో పోలీసుల సహాయ నిరాకరణపై కూటమిలోని సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నిన్ననే (ఆదివారం) ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సభలో ఎక్కడా పోలీసు కనిపించని అంశాన్ని నేరుగా సభలోనే ప్రధాని ప్రస్తావించారు. కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కోడ్ అమలులోకి రావడంతో ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. డీజీపీ, డీఐజీ, పలనాడు జిల్లా ఎస్పీలపై మూడు పార్టీల నేతలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం సీఈవోను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. బాధ్యులైన వారు ఎవరని రాష్ట్ర బీజేపీ నేతలను ఢిల్లీ బీజేపీ నేతలు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Viral Video: మారిన ట్రెండ్.. బెండీ సమోసా చుశారా?


సభలో ఇలా..

నిన్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ‘‘ప్రజాగళం’’ పేరుతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సభ జరిగింది. ప్రధాని మంత్రి మోదీ హాజరైన ఈ సభపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేశారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలాగే సభా ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ‘సౌండ్‌’ స్టాండ్లపైకి జనం ఎక్కడంతో ఆడియో కేబుల్‌ తెగి సౌండ్‌ సిస్టమ్‌ ఆగి పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాని ప్రసంగిస్తుండగానే అంతరాయం కలిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నిర్లక్ష్యం ఉద్దేశపూర్వకమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి...

MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్..

Praja Galam: జగన్.. పోలీసులు ఎక్కడ..!?


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2024 | 10:59 AM