Share News

Pawan Kalyan: మహిళలను వేధిస్తే తాట తీయండి.. పవన్ వార్నింగ్

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:35 PM

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి ప్రజా సమస్యల పరష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు.

Pawan Kalyan: మహిళలను వేధిస్తే తాట తీయండి.. పవన్ వార్నింగ్
Pawan Kalyan

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు. తనకు వచ్చిన దరఖాస్తులను వెను వెంటనే పరిశీలించి పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ‘జనవాణి - జనసేన - భరోసా’ పేరిట పవన్ కళ్యాణ్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖలకు పంపి, పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.


దరఖాస్తులు త్వరగా పరిష్కారం..

అర్జీల స్వీకరణలో భాగంగా శనివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దీంతో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. సమస్యలు త్వరగా పరిష్కారం అవుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు. జనసేన కార్యాలయంలో ఈరోజు కొన్ని దరఖాస్తులను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. అయితే వెంకటగిరిలో మహిళలు, వృద్ధులను వేధిస్తున్నారంటూ ఓ మహిళ పంపిన అర్జీ పవన్‌‌ను కదిలించింది. వెంటనే ఆయన స్పందించి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

pawan-2.jpg


వెల్లువలా అర్జీలు..

• పవన్ కళ్యాణ్- తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్నారు.

• ఈ రోజు ఉదయం నుంచి డిప్యూటీ సీఎం తన కార్యాలయ సిబ్బందితో కలసి ప్రతి అర్జీని చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన దరఖాస్తులతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.

• సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు, సమస్య తీవ్రతను బట్టి అధికారులతో పవన్ మాట్లాడుతున్నారు.

• తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలిపిన సమస్య పవన్ కళ్యాణ్‌ని కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్‌లపై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులు, యువతులు, మహిళలను వేధిస్తున్నారని వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. అదే విధంగా యువతుల ఫొటోలు తీసి ఇంటర్నెట్‌‌లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం, ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎదుట బాధితురాలు వాపోయారు.


కఠిన చర్యలు

• సదరు యువకుల వివరాలు, బైక్స్‌పై వేగంగా సంచరిస్తున్న ఫొటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు.

• ఆ యువకులను పట్టుకొని హెచ్చరిస్తే ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామని బెదిరించారని బాధితులు పవన్ కళ్యాణ్‌కు తెలిపారు.

• యువకులు ఒక మహిళా ఎస్‌ఐను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

• పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఆడ పిల్లలు, మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

• ఈ సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని తగు చర్యలు తీసుకొంటామని తిరుపతి ఎస్పీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Jagan: వైఎస్ జగన్‌ను నెటిజన్లు గట్టిగానే ఆడుకుంటున్నారే..!

Hari Rama Jogaiah: హరిరామ జోగయ్య మళ్లీ స్టార్ట్ చేశారు.. ఈసారి చంద్రబాబును కూడా..

Union Minister Murugan: ఏపీ ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2024 | 07:33 PM