Pawan Kalyan: లంచం అనే పదం వినిపించొద్దు... పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 19 , 2024 | 07:42 PM
లంచం అనే పదం వినిపించొద్దని... అలాంటి అధికారులు, వ్యక్తులు తన వద్ద ఉండొద్దని చెప్పానని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. తొలిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థలో రూపాయి లంచం లేకుండా, రికమండేషన్ లేకుండా బదిలీలు చేశామని చెప్పారు. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి పారదర్శకతతో ఈ బదిలీలు జరిగాయని వివరించారు.
అమరావతి: లంచం అనే పదం వినిపించొద్దని... అలాంటి అధికారులు, వ్యక్తులు తన వద్ద ఉండొద్దని స్పష్టంగా చెప్పానని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. తొలిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థలో రూపాయి లంచం లేకుండా, రికమండేషన్ లేకుండా బదిలీలు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి పారదర్శకతతో ఈ బదిలీలు జరిగాయని వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల నేపథ్యంలో రూల్ బుక్ ఏం చెబుతుందో అదే వివరిస్తున్నామని అన్నారు. కొన్ని బదిలీలు రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న వాటిని నిలిపివేశామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
డిప్యూటీ సీఎం పేషీలో ఉన్న అధికారులు అంతా పూర్తి పారదర్శకంగా పని చేస్తున్నారని తెలిపారు. కాగా.. ఈరోజు పలువురు పవన్ కళ్యాణ్ సమక్ష్యంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి భారతి కూడా ఉన్నారు. దీంతో ముద్రగడకు బిగ్ షాక్ తగిలింది. పార్టీలో చేరిన వారికి పవన్ కళ్యాణ్ జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... రాష్ట్రం బాగుండాలని , ఒక ఆశయాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు. తమ మీద నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరిన వారందరికీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల సమయంలోనే ముద్రగడ కుమార్తె క్రాంతి భారతి జనసేనలో చేరుతానని వచ్చారని అన్నారు. ఆ కుటుంబాన్ని విడదీయటం ఇష్టం లేదని ఆనాడే చెప్పానని అన్నారు. ముద్రగడ కుమార్తె 100 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి తన భర్తతో కలిసి జనసేనలో చేరారని చెప్పారు. సీనియర్ నేత చందూ సాంబశివరావుతో పాటు, గుంటూరు, జగ్గయ్యపేట, పెడన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈరోజు జనసేనలో చేరారని అన్నారు. సామినేని ఉదయభాను ఎంతో కాలం నుంచీ తనకు తెలుసునని చెప్పారు. రాజకీయాలను క్రమశిక్షణతో చేసే వ్యక్తి.. మాట తూలని వ్యక్తి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
‘‘నాతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చిన సామినేని ఉదయభానుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు కూడా ఆయన మీద నమ్మకంతో అప్పగించాను. గ్రామసభ వారోత్సవాల ద్వారా పల్లెల్లో అభివృద్ది చేస్తున్నాం. ప్రజలకు ఎటువంటి సేవ చేయాలన్నా కూడా తప్పకుండా పార్టీ పరంగా ప్రోత్సహిస్తాం. గుడివాడలో మంచినీటి ఇబ్బంది ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదు. ఆయాగ్రామాల్లో మంచినీరు అందించే విధంగా వెంటనే యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాం. ఇది మన ప్రభుత్వం.. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను హక్కుగా చేయించుకోండి’’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
జనసేనలో చేరిన నేతలు వీరే...
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు నాయకులకు జనసేన కండువా కప్పి ఆహ్వానించారు. రాజమండ్రికి చెందిన క్రాంతి దంపతులు, అమలాపురానికి చెందిన కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు జనసేనలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేనలో చేరిన వారిలో క్రాంతి... వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె, వైసీపీ సీనియర్ నాయకుడిగా ఉన్న చందూ సాంబశివరావు , వీరితో పాటు గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు నిమ్మల వెంకటరమణ, సంకూరి శ్రీనివాసరావు, ఇర్రి ధనలక్ష్మి, అయిశెట్టి కనకదుర్గ, జగ్గయ్యపేట మున్సిపాలిటి కౌన్సిలర్లు కొలగాని రాము, కాశీ అనురాధ, తుమ్మల ప్రభాకర్ రావు , కాటగాని శివ కుమారి, తన్నీరు నాగమణి , సాధుపాటి రాజా, పాకలపాటి సుందరమ్మ, షేక్ సిరాజున్, మోరే సరస్వతి, పండుల రోశయ్య, కోఆప్షన్ మెంబర్లు చైతన్య శర్మ, ఖాదర్ బాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాజీ, వీరయ్య చౌదరి, పెడన నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ జక్కా ధర్మారాయుడుతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు, నాయకులు జనసేన తీర్దం పుచ్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..
ABN Effect: విశాఖ శారదా పీఠంకు కేటాయించిన స్థలంపై సర్కార్ కీలక నిర్ణయం
Read Latest AP News And Telugu News