Payyavula Keshav: ఆర్థిక సవాళ్లను అధిగమిస్తాం.. పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 22 , 2024 | 07:17 PM
విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, గడిచిన 5 ఏళ్ల లో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దాడానికి కేంద్ర సహకారం కావాలని కోరానని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు.
ఢిల్లీ: విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, గడిచిన 5 ఏళ్ల లో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దాడానికి కేంద్ర సహకారం ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. రాష్ట్రానికి ఏం కావాలి అనే అంశంపై కేంద్రానికి నివేదిక అందజేశానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి సహకారం అందించాలని కోరామన్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో ఈరోజు(శనివారం) జరిగిన ఫ్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పయ్యావుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ... అమరావతి నిర్మాణానికి సహకారం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
పారిశ్రామిక రాయితీలు, పారిశ్రమిక కారిడార్ల ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని, ఆక్వా పార్కులు,టెక్స్ టైల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు మద్దతు కావాలని కోరామన్నారు. తిరుపతి వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లకు రావాల్సిన రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరామన్నారు. రైల్వే జోన్ ఆపరేషన్‌కు సహకారం ఇవ్వాలన్నారు. రైల్వే జోన్ ఆపరేషన్ కు సహకారం అందించాలన్నారు. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకారమంది చాలన్నారు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం కృషి చేస్తామని తెలిపారు. చేనేత వస్త్రాలపై 5 శాతం పన్ను మినహాయింపు కోరినట్లు చెప్పారు. కూరగాయలు, పండ్ల ప్యాకింగ్ కర్టన్లపై పన్ను తగ్గించారని మండిపడ్డారు. ఎరువులపై పన్ను తగ్గింపును జీవోఎంకి రీఫర్ చేశారని చెప్పారు. సమస్యలు తగ్గించేలా చాలా అంశాలపై జీఎస్టీ మండలిలో నిర్ణయాలు జరిగాయని చెప్పారు.
కేంద్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని మంత్రిత్వ శాఖల నుంచి వివరాలు సేకరించి కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో ప్రస్తావించామని చెప్పారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని నిలబెట్టాలి.పరుగులు పెట్టించాలి అన్నది చంద్రబాబు ఆలోచన అని... అది నమ్మారు కాబట్టే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని ఉద్ఘాటించారు. 100 కి 93 శాతం రిజల్ట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయడానికి సమయం పడుతుందన్నారు. కొందరు కార్యదర్శుల పదవీకాలం ముగిసిందని చెప్పారు. ప్రజల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం...అనుమానం అవసరం లేదని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.