Share News

Street Dogs Attack :బాబోయ్‌.. కుక్కలు కరుస్తున్నాయ్‌.. గుంటూరు జిల్లాలో వీధి కుక్కల బీభత్సం

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:04 PM

గుంటూరు జిల్లాలోని తెనాలి మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.బయటకు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువైంది. ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Street Dogs Attack :బాబోయ్‌.. కుక్కలు కరుస్తున్నాయ్‌..  గుంటూరు జిల్లాలో వీధి కుక్కల బీభత్సం

గుంటూరు జిల్లా: జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్‌, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి. వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపుగుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్ళే వారిపై దాడులు చేస్తుండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు జిల్లాలో ఎక్కడో ఒక చోట వీధి కుక్కల బారిన పడి గాయపడిన సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడే స్పందించే అధికారులు తర్వాత పట్టించుకోవడం లేదు.


తెనాలి మండలంలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ఒకే రోజు 8 మందిపై వీధి కుక్కల దాడి చేశాయి. బాధితుల్లో ఇద్దరు మూడేళ్ల చిన్నారులు ఉన్నారు. బాలాజీరావుపేట, య‌డ్ల లింగయ్య కాలనీ, గంగాన‌మ్మపేట‌, క‌ఠెవరం, వ‌లివేరు ప్రాంతాల్లో చిన్నపిల్లలు పెద్దలపై దాడి చేసి వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. పిచ్చయ్య (68), రామకృష్ణ (63) రాజశేఖర్ (49), పద్మావతి (25), శివమ్మ (50), సామ్రాజ్యం (50), షణ్ముఖ (3), టి ప్రేజీ( 3) కుక్కుల దాడిలో గాయపడ్డారు. వారికి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.

DOGS.jpg


నామమాత్రంగా చర్యలు

కుక్కల సంఖ్య పెరగకుండా ఉండేందుకు బర్త్‌ కంట్రోల్‌ ఆపరేషన్లు నామమాత్రంగా జరుగుతున్నాయి. కుక్కల వ్యాక్సినేషన్‌ పరిస్థితి అంతే. క్షేత్రస్థాయిలో కుక్కలను ఒకేసారి పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి వాటికి వాక్సినేషన్‌ చేసి బర్త్‌ కంట్రోల్ చికిత్స చేసేందుకు అవసరమైన స్థలం, సిబ్బంది లేరు. ఈప్రక్రియను వేగవంతంగా చేపట్టేందుకు అవసరమైన నిధులు, ఇతరత్రా సౌకర్యాలూ లేవు. దీంతో వీధికుక్కలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీధికుక్కల బెడద నివారించేందుకు జిల్లా అధికారులు యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ శస్త్రచికిత్స చేయడంతోపాటు యాంటీ రేబిస్‌ వాక్సిన్‌ వేసి వదిలి పెడుతోంది. వీధికుక్కల బెడదను పూర్తిస్థాయిలో నివారించాలని ప్రజలు కోరుతున్నారు. కుక్కలను తరలించేందుకు ప్రత్యేక వాహనం, సిబ్బందిని ఏర్పాటు చేసి కుక్కలకు బర్త్‌కంట్రోల్‌ చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసిన ప్రాంతాలకు వెళ్లి వీధి కుక్కలను తీసుకెళ్లి బర్త్‌కంట్రోల్‌ ఆపరేషన్‌ చేసి తిరిగి వదిలిపెడుతున్నారు. నగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి వీధి కుక్కలను ప్రత్యేక స్థలానికి తరలించి తమ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు..

రక్షణ కోరుతున్న వైసీపీ సైకోలు..

లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 10 , 2024 | 12:06 PM