Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష..
ABN , Publish Date - Jun 25 , 2024 | 07:53 PM
కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు.
అమరావతి: కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు. ప్రముఖులు పెద్దఎత్తున సంస్మరణ సభకు రానున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లు, భద్రత, మౌలిక వసతులు కల్పన, పార్కింగ్, తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, సినిమా రంగ ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు కేంద్ర సమాచార శాఖ నుంచి, ఎడిటర్స్ గిల్డ్, ప్రముఖ జర్నలిస్టులు సహా సుమారు 7వేల మందిని ఆహ్వానించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.
ఇది కూడా చదవండి:
ST Commission: వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో సీఎస్ నీరబ్ కుమార్‌కు ఎస్టీ కమిషన్ నోటీసులు..