Share News

AP NEWS: నేషనల్ వాలీబాల్ టోర్నీలు ఎప్పటి నుంచంటే..

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:16 PM

Andhrapradesh: క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు సరికొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించారని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా స్కీం ద్వారా నిధులను తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని రవినాయుడు పేర్కొన్నారు.

AP NEWS: నేషనల్ వాలీబాల్ టోర్నీలు ఎప్పటి నుంచంటే..
Ravi Naidu

విజయవాడ: జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో సీనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలు నిర్వహిస్తున్నట్లు శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఏపీ తరపున ఈ పోటీల్లో పాల్గొనేందుకు వాలీబాల్ టీం ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. స్వయంగా క్రీడాకారుల ప్రతిభను పరిశీలిస్తున్నామని అన్నారు. గత నాలుగేళ్లుగా ప్రోత్సాహకం లేక రాష్ట్రంలో వాలీబాల్ క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఏపీ నుంచి వాలీబాల్ టీంను నేషనల్ గేమ్స్‌కు ఎంపిక చేయడానికి జగన్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వాలీబాల్‌లో గొప్ప మెడల్స్ సాధించిన క్రీడాకారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా ప్రోత్సాహం కరవైందని చెప్పారు. ఓపెన్ సెలక్షన్లు పెట్టి జాతీయ వాలీబాల్ పోటీలకు టీంలను ఎంపిక చేస్తున్నామని అన్నారు. నేషనల్ టీం సమక్షంలో బాగా ఆడిన రాష్ట్ర క్రీడాకారులనే జాతీయ వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపిక చేస్తున్నామని చెప్పారు.


ఏపీ, కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చిన ఆఫీసర్ల టీం సభ్యులు పారదర్శకంగా క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారని అన్నారు. పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారినే ఏపీ వాలీబాల్ టీంలోకి ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు సరికొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా స్కీం ద్వారా నిధులను తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Andhra Pradesh: ఈ దొంగోడి స్టైలే వేరు.. బట్టలన్నీ తీసేసి మరీ..

CM Chandrababu: మన్మోహన్ సింగ్‌ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది

Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 27 , 2024 | 03:26 PM