Share News

CM Chandrababu: పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Aug 08 , 2024 | 02:43 PM

టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం గురువారం నాడు జరిగింది. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే దానిపై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పొలిట్ బ్యూరో సమావేశం ఈరోజు జరిగింది.

CM Chandrababu: పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు
CM Chandrababu Naidu,

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో పార్టీ సమావేశం (TDP Polit Bureau Meeting) గురువారం నాడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగింది. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలకు చంద్రబాబు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. రెండున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. నామినేటెడ్ పదవులపై చంద్రబాబు చర్చించారు. వీలైనంత త్వరగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


పేదరిక నిర్మూలనపై..

పొలిట్ బ్యూరో సమవేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాకు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘‘దక్షిణ భారతదేశంలో జనాభా నిష్పత్తి రోజురోజుకూ తగ్గుతుంది. జనాభా నిష్పత్తి తగ్గడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం తగ్గుతాయి. తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలి. పార్టీ సభ్యత్వ రుసుం రూ.100లతో ప్రారంభిస్తాం. సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు వచ్చే విధంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. పేదరిక నిర్మూలనపై ప్రధానంగా చంద్రబాబు చర్చించారు. త్వరలో పేదరిక నిర్మూలనపై విధివిధానాలు రూపొందిస్తాం. విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీ వర్గీకరణకు జిల్లాను యూనిట్‌గా తీసుకుంటాం. జన్మభుమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. జన్మభూమి2 గా ఈ కార్యక్రమానికి నామకరణం చేయాలని భావించారు. మొన్నటి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సరిగ్గా దృష్టి పెడితే వైసీపీ గెలిచిన సీట్లలో మరో నాలుగు నుంచి ఐదు సీట్లు టీడీపీ గెలిచేది’’ అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


డీలిమిటేషన్‌లో అన్యాయం: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పొలిట్ బ్యూరోలో ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 55 రోజుల పాలనపై అధినేత చంద్రబాబు చర్చించారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘త్వరలో జన్మభూమి2 ప్రారంభం కాబోతుంది. జన్మభూమి -2 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. వర్షాలతో ప్రాజెక్టులన్ని నిండుకుండలా ఉన్నాయి. ప్రాజెక్టులు నిండటంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గుండె నీరు కారుతోంది. నామినేటెడ్ పోస్టులను అతి త్వరలో భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇసుకలో అక్రమాలు సహించబోనని అధినేత మరోసారి హెచ్చరించారు జనాభా నియంత్రణతో డీలిమిటేషన్‌లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోంది. ఒక యూపీలో 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారతదేశంలో160 మాత్రమే ఉంటాయి. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయి’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.


విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చ..!!

విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే దానిపై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ తొలి పొలిట్ బ్యూరో సమావేశం ఇది. ఈ భేటీకి మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బొండా ఉమామహేశ్వర రావు, పల్లా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గ్రేటర్ విశాఖలో వైసీపీకి షాక్..

ఇంకా వైసీపీ మత్తులోనే కొందరు అధికారులు..

క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 08 , 2024 | 04:30 PM