Share News

AP Govt: ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:18 PM

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 9 మంది అధికారులకు పలు విభాగాలకు బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఏఉత్తర్వులు జారీ చేశారు.

AP Govt: ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 9 మంది అధికారులకు పలు విభాగాలకు బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఏఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ఉన్న అంజనా సిన్హా బదిలీ, ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ‌గా అంజనా సిన్హాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మాదిరెడ్డి ప్రతాప్‌ను ఏపీ రాష్ట్ర విపత్తు నివరణ, ఫైర్ సర్వీసెస్‌లో నియామించారు. సీ హెచ్ శ్రీకాంత్‌ను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆక్టోపస్ నుంచి బదిలీ చేశారు.ఆయనను డీజీపీ ఆఫీస్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్‌‌కు మార్చారు. స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ ఎస్ వి రాజశేఖర్ బాబు బదిలీ.. ఆయనను విజయవాడ కమిషనర్‌గా నియమించారు.


విజయవాడ కమిషనర్‌గా పనిచేస్తున్న పీహెచ్డీ రామకృష్ణను డీజీపీ ఆఫీస్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రోవిజనింగ్, లాజిస్టిక్స్‌కు బదిలీ చేశారు. ఆయనకే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రే హౌండ్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న గోపీనాథ్ జట్టిని బదిలీ చేశారు. ఆయనను విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు, కోస్టల్ సెక్యూరిటీ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్‌గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. విశాల్ గున్నిని తదుపరి ఉత్తర్వులు కోసం డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రే హౌండ్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా వున్న కొయ ప్రవీణ్ బదిలీ అయ్యారు. ఆయనను కర్నూల్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు. కర్నూల్ రేంజ్‌లో ఉన్న సీహెచ్ విజయరావును డీజీపీ ఆఫీస్‌లో తదుపరి ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జీఓఆర్టీ నంబర్ 1245 ను సీఎస్ నీరాబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు.


null

Updated Date - Jul 11 , 2024 | 10:32 PM