TulasiReddy: ఆ హత్యతో జగన్‌కు సంబంధం లేదా..?
ABN , Publish Date - Mar 02 , 2024 | 05:55 PM
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి అడిగే ప్రశ్నలకు సీఎం జగన్(CM Jagan) ఎందుకు సమాధానం చెప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి (TulasiReddy) ప్రశ్నించారు.
విజయవాడ: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి అడిగే ప్రశ్నలకు సీఎం జగన్(CM Jagan) ఎందుకు సమాధానం చెప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి(TulasiReddy) ప్రశ్నించారు. శనివారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వివేకాను ఎందుకు హత్య చేశారు.. ఎలా చేశారో జగన్‌కు తెలుసునని చెప్పారు. తన అన్న జగన్‌కు అంతా తెలుసని ఆయన చెల్లెలు సునీత చెబుతున్నారని అన్నారు. వివేకాను హత్య చేసిన నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని సునీత చెబుతుందన్నారు. జగన్ ప్రమేయం లేకుండా సీబీఐని చర్యలు తీసుకోనియకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ కేసులను వాదించే న్యాయవాదులే.. అవినాష్ రెడ్డికి మద్దతుగా వాదించడం లేదా అని నిలదీశారు. తన తండ్రి హంతకులను శిక్షించాలని కోరితే.. సునీతపై కేసులు ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. జగన్‌కి ఈ హత్యతో సంబంధం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. సిగ్గు, ఎగ్గు ఉంటే.. జగన్ ఈ ఘటనపై నోరు విప్పాలని అన్నారు. సొంత బాబాయిని చంపిన వారిని శిక్షించలేని జగన్‌కు సీఎంగా ఉండే అర్హత ఉందా అని తులసిరెడ్డి నిలదీశారు.
ఇవి కూడా చదవండి
YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో మరో కొత్త కోణం.. చైతన్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Gorantla: వివేకా హత్య కేసులో జగన్ పాత్రపై గోరంట్ల సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి