Share News

YS Jagan: 2029లో వచ్చేది మన ప్రభుత్వమే.. వైసీపీ నేతలతో జగన్

ABN , Publish Date - Jun 20 , 2024 | 05:37 PM

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ(YSRCP) ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) భేటీ అయ్యారు. 2029లో మళ్లీ వైసీపీనే వస్తుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్. 2029 వచ్చే నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని అన్నారు.

YS Jagan: 2029లో వచ్చేది మన ప్రభుత్వమే.. వైసీపీ నేతలతో జగన్
YS Jagan

అమరావతి, జూన్ 20: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ(YSRCP) ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) భేటీ అయ్యారు. 2029లో మళ్లీ వైసీపీనే వస్తుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్. 2029 వచ్చే నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని అన్నారు. ప్రజలు ఇవన్నీ గుర్తు పెట్టుకుని వైసీపీని ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు జగన్. అప్పుడు చంద్రబాబుకు కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని.. జరగబోయేది ఇదేనని అన్నారు.


YS-Jagan-Meeting-With.jpg

వైసీపీ నేతలతో జగన్ ఏమన్నారంటే..

2029లో వైసీపీనే వస్తుంది. 2029 నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారు. ప్రజలు ఇవన్నీ గుర్తు పెట్టుకుని మళ్లీ మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ సమయంలో చంద్రబాబుకు కేవలం సింగిల్ డిజిట్ వస్తుందనేది వాస్తవం. మనం విశ్వసనీయతతో రాజకీయాలు చేశాం. ప్రజలకు తోడుగా ఉండేలా, వారికి మద్దతుగా పోరాటం చేసే కార్యక్రమాలు చేస్తాం. మనకి వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. స్పీకర్ పదవి తీసుకునే వ్యక్తి సిగ్గులేకుండా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ ఓడిపోయాడు.. ఇంకా చావలేదు అని ఒకరు అంటారు. మరొకరు చచ్చే వరకు జగన్‌ను కొట్టండని అంటారు. ఇలాంటి వ్యక్తి రేపు స్పీకర్ అవుతారట. మనం ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి వెళ్లబోతున్నాం. అసెంబ్లీలో మనం ఏదో చేస్తామనే నమ్మకం మాత్రం నాకు లేదు. మనం ప్రజలతో కలిసి పోరాటం చేసే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. జగన్ పాలనలో కులం, మతం చూడలేదు.. ఏ పార్టీకి ఓటు వేశారో కూడా చూడలేదు. నేడు కేవలం వారి పార్టీకి ఓటు వేయలేదనే కారణంతో కొడుతున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అనేక గ్రామాలలో ఇదే విధంగా చేస్తున్నారంటే.. వారి పాపాలు పండే సమయం త్వరలోనే వస్తుంది అని జగన్ అన్నారు.


YSRCP-Leaders.jpg

వైసీపీ అధికారంలో ఉండి ఉంటే..!

జగన్ పాలనలో మ్యానిఫెస్టో అనేది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కనిపించేది. ఇప్పుడు రెడ్ బుక్ అని వాళ్లు హోర్డింగ్స్ పెడుతున్నారు. కక్ష సాధింపు చేయబోయే అధికారులు ఎవరు, నాశనం చేయబోయే వారి పేర్లను రాసుకున్నారు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లుగా రెడ్ బుక్‌తో నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తున్నారు. శిశుపాలుని పాపాలు వేగంగా సాగుతున్నాయి. 273 స్థానాలకు గానూ 240 స్థానాల్లోనే కేంద్రంలో ఉన్న పార్టీకి వచ్చాయి. చంద్రబాబుకు 16స్థానాలు వస్తే.. ఎన్డీయేలో తానే చక్రం తిప్పుతున్నట్లు చంద్రబాబు మోడీ పక్కనే కూర్చున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడగకపోవడం చంద్రబాబు పాపాల్లో భాగాలే. రాష్ట్రంలో ఉన్న పిల్లలకు, ప్రజలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు. జగన్ ఉండి ఉంటే.. వైసీపీ వచ్చి ఉంటే.. విద్యా దీవెన బటన్ అయిపోయి ఉండేది. ఇప్పుడు వసతి దీవెన, అమ్మఒడి, రైతు భరోసా, చివరకు చిన్నది అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్‌లో పెట్టారు. ఒక్క జగన్ తప్పుకోవడం, వైసీపీ పాలన పోవడంతో.. బటన్ నొక్కేవి ఆపేశారు. డిసెంబర్, జనవరి వచ్చే నాటికి హామీలు ఏవంటూ చంద్రబాబును ప్రజలే నిలదీస్తారు. చంద్రబాబు మాటలకు మోసపోయాం అన్న వారికి మనం భరోసా ఇవ్వాలి. మన వైసీపీ కార్యకర్తలకు నాయకులంతా తోడుగా ఉండాలి అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్.

YSRCP-Leaders-2.jpg

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 20 , 2024 | 06:20 PM