Share News

AP NEWS: మంత్రి సత్యకుమార్ ప్రశ్నల వర్షం.. వైసీపీ సభ్యుల వాకౌట్

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:27 PM

శాసన మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మంత్రి సత్య కుమార్ సమాధానానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. పులివెందులపై ఉన్న శ్రద్ధ రాయలసీమలోని ఇతర కాలేజ్‌లపై ఎందుకు లేదో వైసీపీ సభ్యులు చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.

AP NEWS:  మంత్రి సత్యకుమార్ ప్రశ్నల వర్షం..  వైసీపీ సభ్యుల వాకౌట్

అమరావతి: మంత్రి స‌త్యకుమార్ తీరును నిర‌సిస్తూ శాస‌న మండ‌లి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై మంత్రి సత్య కుమార్ సమాధానానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో అన్ని మెడికల్ కాలేజ్‌ల నిర్మాణానికి ఒకే విధమైన నిధులు ఖర్చు చేయలేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. పులివెందుల కాలేజ్ నిర్మాణానికి రూ.500 కోట్లకు గారూ. రూ. 290 కోట్లు ఖర్చు చేశారని మంత్రి తెలిపారు.అదే సమయంలో మార్కాపురం కాలేజ్‌ కోసం రూ. 475 కోట్లకు గానూ కేవలం రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి సత్య కుమార్ తెలిపారు.


Satya-Kumar.jpg

పులివెందులపై ఉన్న శ్రద్ధ రాయలసీమలోని ఇతర కాలేజ్‌లపై ఎందుకు లేదో వైసీపీ సభ్యులు చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. పులివెందులలో ఆడపిల్లల హాస్టల్స్ కట్టకుండా వారు చెట్ల కింద కూర్చొని చదువుకోవాలా అని మంత్రి‌ నిలదీశారు. ప్రతిరోజు మెడికల్ కాలేజీలపై కూటమీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సత్యకుమార్ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.


కాగా గతంలో ఏపీ శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నా.. రెండు బిల్లులు ఆమోదం పొందడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. తాము లేని సమయంలో బిల్లులు ఆమోదించుకున్నారని, దీనిపై శాసనమండలి ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాలని వైసీపీ నేతలు భావించారు. అయితే శాసనమండలి సమావేశాలకు ఎవరూ రావద్దన్నారని అధికారపక్షం ప్రశ్నిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పెడుతూ శాసనసభ ఆమోదించిన బిల్లు.. శాసనమండలి కూడా ఆమోదించింది. ఈ పరిణామంతో వైసీపీ ఖంగుతింది.


జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లులను శాసనమండలి ఆమోదించింది. ఈ రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆ బిల్లులను శాసన మండలిలో ప్రవేశపెట్టారు. పలువురు అధికార పార్టీ ఎమ్మెల్సీలు ల్యాండ్ టైటిలింగ్ బిల్లులోని లోపాలను ఎత్తిచూపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట వైసీపీ సర్కార్ చేసిన చట్టం రాక్షస చట్టంగా వ్యాఖ్యానించారు.


భూ దోపిడీల కోసమే ల్యాండ్ టైటిలింగ్..

భూ దోపిడీల కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని వైసీపీ తెచ్చిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. ఇందులో చాలా లోపాలున్నాయని గతంలోనూ చట్టాన్ని వ్యతిరేకించినా గత జగన్ సర్కారు రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేసిందని విమర్శించారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించలేని ఇలాంటి బిల్లులను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టగా జగన్ ప్రభుత్వం తొలగించడాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. తిరిగి ఆయన పేరుపెట్టి మహనీయుడిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ

Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 15 , 2024 | 02:52 PM