AP Election 2024: పవన్ అలా చేయాలి.. హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 15 , 2024 | 08:06 PM
జనసేన - తెలుగుదేశం పార్టీ - బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్రపోషించాలని కోరారు. సోమవారం నాడు పాలకొల్లులో హరిరామ జోగయ్య అధ్యక్షతన ఏపీ కాపు బలిజ సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు.
పశ్చిమగోదావరి: జనసేన - తెలుగుదేశం పార్టీ - బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్రపోషించాలని కోరారు. సోమవారం నాడు పాలకొల్లులో హరిరామ జోగయ్య అధ్యక్షతన ఏపీ కాపు బలిజ సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు.
AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి కొట్టేయండి..
ఈ సందర్భంగా హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. కాపు బలిజ తెలగ ఒంటరి కులస్థుల సంక్షేమమే ధ్యేయంగా కాపు బలిజ సంక్షేమ సేన పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో గెలవడానికి కాపు బలిజ సంక్షేమ సేన కృషి చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా జనసేన మెరుగైనా పాత్ర పోషిస్తుందని తెలిపారు. కాపు బలిజ కులస్తుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామన్నారు.
AP Elections: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అన్నిచోట్ల సమైక్యంగా తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ పనిచేస్తుందని వివరించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కాపు బలిజ కులస్తులు అన్ని విధాలా కృషి చేయాలన్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో.. జనసేన పార్టీకి కాపు బలిజ సంక్షేమ సంఘం అలా పని చేయాలని సూచించారు.
రాష్ట్రంలో 25 శాతం ఉన్న కాపులకు బీసీలతో సమానంగా అన్ని సంక్షేమ పథకాలు అందించాలని తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో అన్నిచోట్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవడానికి అన్ని విధాలా సహకరించాలని హరిరామ జోగయ్య కోరారు.
Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి
మరిన్ని ఏపీ వార్తల కోసం...