Home » Harirama Jogaiah
Andhrapradesh: మాజీ ఎంపీ హరిరామజోగయ్య మరో లేఖతో ముందుకు వచ్చారు. ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి లేఖ రాశారు. గోదావరి జిల్లాలో అభివృద్ధిపై ప్రస్తావించారు. గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత అభివృద్ధికి తక్షణం చొరవ చూపాలన్నారు.
జనసేన - తెలుగుదేశం పార్టీ - బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్రపోషించాలని కోరారు. సోమవారం నాడు పాలకొల్లులో హరిరామ జోగయ్య అధ్యక్షతన ఏపీ కాపు బలిజ సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) మంగళవారం నాడు లేఖ రాశారు. బీసీలకు డిక్లరేషన్ ద్వారా 11 హామీలతో కూడిన సంక్షేమ పథకాలు అమలు చేయడం అభినందించదగిన విషయమేనని తెలిపారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కంటే రాబోవు జనసేన, తెలుగుదేశం కూటమిలోనే బీసీలకు ఎక్కువ లబ్ధి జరిగే అవకాశం ఉందని వివరించారు.
మాజీ ఎంపీ చేగొండి హరి రామజోగయ్య(Harirama Jogaiah) రాజకీయ విశ్లేషణలపై లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పార్లమెంటుకు పోటీ చేయాలని ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిదని తెలిపారు. రాష్ట్ర పాలన, అధికారంలో భాగస్వామ్యం కావాలంటే ఆయన శాసనసభకు పోటీ చేయడమే మేలని తెలిపారు.
Pawan Kalyan: ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొత్తులు, నేతల జంపింగ్‌లతో ఏపీ రాజకీయం (AP Politics) ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇదే సమయంలో పార్టీలకు చెందిన నేతలే కాకుండా కుల సంఘాలకు చెందిన నేతలు సైతం ఆయా పార్టీల అధినేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు.
టీడీపీ- జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Chegondi Harirama Jogaiah) హర్షం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై వ్యక్తిగతంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే తాము కూడా కాపు సంఘం నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంపై వ్యక్తిగతంగా మాట్లాడతామని జనసేన పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు(Govinda Rao) హెచ్చరించారు.
మాజీ మంత్రి హరిరామజోగయ్య ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి రాసిన ఘాటు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ( Harirama Jogaiah ) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీల మైత్రి బంధాన్ని చెడగొట్టేందుకు కొందరు నా పేరుతో ఫేక్ లెటర్లు విడుదల చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేయిస్తున్నారని హరిరామ జోగయ్య లేఖలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది.