Btech Ravi: వైసీపీ పెద్ద ప్లానే వేసింది.. బీటెక్ రవి సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Nov 09 , 2024 | 02:52 PM
వర్ర రవీంద్రరెడ్డి కేసులో వైసీపీ పెద్ద కుట్ర చేస్తున్నట్లు అర్థమవుతోందని బీటెక్ రవి అనుమానం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ప్రాణాలకు వైసీపీ నేతలే హాని తలపెట్టి దాన్ని ఎన్డీయే ప్రభుత్వం, పోలీసులపై మోపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
కడప: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి గురించి కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన కేసులో అరస్టయ్యి తప్పించుకుపోయిన వర్రా రవీంద్రారెడ్డికి వైసీపీ నేతల వల్లే ప్రమాదం పొంచి ఉందని రవి తీవ్ర ఆరోపణలు చేశారు. పారిపోయిన అతనికి హాని కలిగించి ఆ నెపాన్ని ఏపీ పోలీసులు, కూటమి ప్రభుత్వంపై నెట్టాలని వారు చూస్తున్నారంటూ బీటెక్ రవి విమర్శలు గుప్పించారు.
ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితపై తప్పుగా ప్రచారం చేసిన కేసులో రవీంద్రారెడ్డి.. కడప పోలీసుల నుంచి తప్పించుకుని పోయాడు. అయితే కడప పోలీసులే అతన్ని తప్పించారనే తీవ్ర ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే నిన్న (శుక్రవారం) రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారంటూ వైసీపీ నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారని రవి తెలిపారు. నేడు మళ్లీ అరెస్టు కాలేదు.. తప్పించుకున్నాడంటూ పోస్టులు పెట్టారని ఆయన చెప్పారు.
దీన్ని బట్టి చూస్తే వైసీపీ పెద్ద కుట్ర చేస్తున్నట్లు అర్థమవుతోందని రవి అనుమానం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ప్రాణాలకు వైసీపీ నేతలే హాని తలపెట్టి దాన్ని ఎన్డీయే ప్రభుత్వం, పోలీసులపై మోపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫ్యాన్ పార్టీకి రాజకీయ ప్రయోజనం కలుగుతుందంటే ఆ పార్టీ నేతలు ఎంతటి నీచానికైనా, దుర్మార్గానికైనా పాల్పడతారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డికి వర్రా రవీందర్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయని రవి అన్నారు. రాఘవరెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తే అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని బీటెక్ రవి చెప్పుకొచ్చారు.
కాగా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం కేసులో వర్ర రవీంద్రారెడ్డిని గత మంగళవారం నాడు కడప పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసిన కాపేటికే అతని నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. మరో కీలక కేసులో అతన్ని అరెస్టు చేసేందుకు రాజంపేట పోలీసులు కడప స్టేషన్‌కు రాగా అప్పటికే అతను తప్పించుకుపోయాడు. అప్పట్నుంచీ ఇంతవరకూ రవీంద్రారెడ్డి ఆచూకీ తెలియరాలేదు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఎస్పీ హర్షవర్ధన్ రాజుతోపాటు మరో అధికారిపై వేటు వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
Supreme Court: పుణ్య క్షేత్రాలను ప్రత్యేక రాష్ట్రాలు చేయాలా?
Read Latest AP News And Telugu News