Mandipalli Ramprasad Reddy: వైసీపీ నేతలు అలా చేస్తే తాట తీస్తాం.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్
ABN , Publish Date - Dec 31 , 2024 | 07:18 PM
Mandipalli Ramprasad Reddy: వైసీపీ నేతలు దాడులకు పాల్పడితే తాటతీస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
కడప : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైసీపీ నేతలు దాడులు చేస్తామంటే సహించమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడిహేయమైన చర్య అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు అధికారం అడ్డం పెట్టుకొని యతేచ్ఛగా దాడులు చేశారని ధ్వజమెత్తారు.జగన్ అహంకారం వైసీపీ నేతలకు అలవాటు అయిందని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఆఫీసుల్లోకి చొరబడి దాడి చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 24 గంటల్లో ఘటనాస్థలానికి చేరుకొని ఎంపీడీవోను పరామర్శించారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి ప్రారంభిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి..
కాగా.. అన్నమయ్య జిల్లాలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వంలోనూ వారి దాడులు కొనసాగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఓ అధికారిపై విచక్షణ రహితంగా వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుకు తీవ్రగాయాలయ్యాయి. వైసీపీ మూకలు మూకుమ్మడిగా ఎంపీడీవోపై దాడికి పాల్పడ్డారు. ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నేత సుదర్శన్‌రెడ్డి, అనుచరులు కర్రలు, కుర్చీలతో దాడి చేశారు. తలుపుకు గడియపెట్టి ఎంపీడీవో జవహర్‌బాబును ఒంటరిగా చేసి కర్రలు, కుర్చీలు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గది తాళాలు అడిగితే ఇవ్వలేదని అక్కసుతో వైసీపీ నేతలు గొడవకు దిగారని అన్నారు. ఎంపీడీవో జవహర్‌బాబుకు గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఎంపీపీ గది తాళాలు ఇవ్వకపోవడంతోనే తనపై దాడి చేశారని ఎంపీడీవో జవహర్‌బాబు తెలిపారు. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. దీంతో అన్నమయ్య జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు అక్కడ నుంచి పంపించివేశారు. ఎంపీడీఓను రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎంపీడీవోను ఫోన్‌లో మంత్రి రాంప్రసాద్, కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు, టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivasa Rao: మంత్రుల మార్పుపై.. పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్
AP High Court: పేర్నినానికి హైకోర్టులో స్వల్ప ఊరట
AP News: చిత్తూరు జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ
AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే
Read Latest AP News And Telugu News