Ramprasad Reddy: క్రీడా శాఖను వైసీపీ భ్రఘ్ట పట్టించింది.. మంత్రి ఫైర్
ABN , Publish Date - Jul 10 , 2024 | 07:44 PM
రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక పోయినా పులివెందుల్లో హాకీ ఆంధ్రప్రదేశ్ పోటీ నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) వ్యాఖ్యానించారు.
కడప: రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక పోయినా పులివెందుల్లో హాకీ ఆంధ్రప్రదేశ్ పోటీ నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్న హాకీ ఆంధ్రప్రదేశ్ అధికారులను అభినందిస్తు న్నానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న స్టేడియాలను ఆధునికరిస్తామని చెప్పారు. మంచి శిక్షణ ఇచ్చేలా తీర్చిదిద్దుతామని వివరించారు. జగన్ ప్రభుత్వంలో క్రీడా శాఖ ఒకటి ఉంది అన్నది కూడా ప్రజలు మర్చిపోరని విమర్శించారు.
ఐదేళ్ల వైసీపీ చివరి పాలనలో ‘ఆడుదాం ఆంధ్ర’ అంటూ ఒక ఈవెంట్ మాత్రమే నిర్వహించారని గుర్తుచేశారు. ‘ఆడుదాం ఆంధ్రా’కు రూ.130 కోట్లు ఖర్చు చేసి క్రీడాకారుల కడుపు కొట్టారని మండిపడ్డారు.క్రీడాకారుల జీవితాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకొని రూ.130 కోట్లు ఖర్చుచేశారన్నారు. క్రీడాకారుల కోసం కాకుండా కేవలం వైసీపీ నాయకుల ప్రచారం కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు. క్రీడాకారుల సొమ్ము వాడుకున్న వారి నుంచి కక్కిచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పేద గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల ద్వారా శాప్ ద్వారా క్రీడా పోటీల నిర్వహిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.