Share News

Cm Revanth Reddy: సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్‌ కార్డులు అవసరం

ABN , Publish Date - Oct 03 , 2024 | 12:44 PM

గత కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్‌కార్డు కోసం పదేళ్లు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగారని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అధికారంలో ఉంటే రేషన్‌కార్డు రాదని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు. కొత్త రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు.

Cm Revanth Reddy: సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్‌ కార్డులు అవసరం

హైదరాబాద్:(జీడిమెట్ల): సంక్షేమ పథకాల అమలు కోసం డిజిటల్‌ కార్డులు అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో నేటినుంచి డిజిటల్ కార్డుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. కుటుంబ డిజిటల్‌ కార్డుల సర్వేను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ కార్డులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు కింద మొత్తం 238 గ్రామాలు, డివిజన్లు ఎంపిక చేసినట్లు వివరించారు. ఈనెల 7 వరకు కుటుంబాల హెల్త్ ప్రొఫైల్‌ను అధికారులు రికార్డు చేస్తారని ముఖ్యమంత్రి అన్నారు. పర్యవేక్షణ కోసం స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. సేకరించిన వివరాల ఆధారంగా డిజిటల్ కార్డులు జారీ ప్రక్రియ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న డిజిటల్ కార్డులను ఇవాళ (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ మేయర్, కలెక్టర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కుటుంబ డిజిటల్‌ కార్డులు ప్రవేశపెట్టినట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


గత కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్‌కార్డు కోసం పదేళ్లు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అధికారంలో ఉంటే రేషన్‌కార్డు రాదని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు. కొత్త రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు. ప్రతి పేదవాడికి ఈ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు కుటుంబానికి రక్షణ కవచమని అన్నారు. కార్డులో కుటుంబానికి సంబంధించిన వివరాలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ గుర్తింపు నెంబర్‌ ఇచ్చి పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఆస్పత్రి రిపోర్టులు కూడా కార్డులోనే డిజిటల్‌గా ఉంటాయని చెప్పారు. పేదలకు సులభతరమైన సంక్షేమం అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. 239 ప్రాంతాల్లో డిజిటల్‌ కార్డుల పథకం పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే

Hyderabad: కేసీఆర్‌, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

KTR: ఈ దొంగ ఏడుపులు దేనికి?

Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Read Latest Telangana News and Telugu News

Updated Date - Oct 03 , 2024 | 12:57 PM