AP Politics: చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. జగన్‌పై వైఎస్ సునీత కన్నెర్ర
ABN , Publish Date - Mar 28 , 2024 | 04:36 PM
Andhra Pradesh News: వైఎస్ జగన్ తీరుపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కూతురు సునీత(YS Sunitha) కన్నెర్ర చేశారు. అసలు చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని జగన్‌ను(YS Jagan) నిలదీశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సునీత..
Andhra Pradesh News: వైఎస్ జగన్ తీరుపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కూతురు సునీత(YS Sunitha) కన్నెర్ర చేశారు. అసలు చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని జగన్‌ను(YS Jagan) నిలదీశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సునీత.. ప్రొద్దుటూరులో వైఎస్ వివేకా హత్య గురించి జగన్ చేసిన కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. ‘మా నాన్న హత్య కేసుపై మా అన్న జగన్ ప్రొద్దుటూరులో మాట్లాడాడు. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? చిన్నాన్న అంటే నాన్న తరువాత నాన్న అని అర్థం. చిన్నాన్న కూతురు మీద నిందలు వేయడం న్యాయమా? నేను కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం స్పందించావా? చిన్నాన్న చనిపోతే కనీసం న్యాయం చేయలేవా?’ అని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు సునీత.
Also Read: ముఖ్యమంత్రి ఇంట జన్మించిన మహాలక్ష్మీ..
ఈ విషయంలో తాను అంతః ఖరణ శుద్దితో చెపుతున్నానని.. జగన్ అలా చెప్పగలడా? అని సునీత ప్రశ్నించారు. ‘వివేకా చిన్నాన్నను చంపింది ఎవరో దేవుడికి తెలుసు.. జిల్లా ప్రజలకు తెలుసు.. అంటున్నాడు జగన్. నేను పోరాడేది న్యాయం కోసం.. మీరు పోరాడేది పదవులు కోసం.’ అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.