Peddireddy: షర్మిల చదివేది ఆయన స్క్రిప్ట్‌నే..
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:26 PM
Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిపై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. షర్మిల ఎవరి స్క్రిప్ట్ చదువుతుందో తమకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు.
కడప, అక్టోబర్ 26: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి పంపకాల ఇష్యూ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆస్తి పంపకాలకు సంబంధించి జగన్‌ను ఉద్దేశించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (YCP Regional Coordinator Peddireddy Ramachandra Reddy) స్పందించారు. ఈ సందర్భంగా షర్మిలపై పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు స్క్రిప్ట్ నే షర్మిల చదువుతున్నారని.. ఇవన్నీ ఎన్నికల ముందు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు.
CM Chandrababu: అంజిరెడ్డి పట్ల సీఎం చంద్రబాబు ఆసక్తి.. ఇంతకీ ఎవరీయన
ఆమె కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆడుతున్న ఆటలో షర్మిల బంతిగా మారారన్నారు. పార్టీ బలోపేతం కన్నా జగన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడమే లక్ష్యంగా షర్మిల భావిస్తున్నారని విమర్శించారు. జగన్ విద్యుత్ శాఖతో మీటింగ్ జరిగితే ఛార్జీల పెంపు కోసమే అంటూ లీకులు ఇచ్చేవారన్నారు. కరెంటు ఛార్జీలు పెంచడం కోసమే మీటింగ్ అని చెబుతారంటూ మండిపడ్డారు. జగన్ తప్పిదం వల్లే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని కూడా అంటారన్నారు. విషపూరిత ధోరణిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తోందన్నారు. రాష్టంలో ఏం జరిగినా దానికి జగనే కారణమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు.. రైతుల పట్ల సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు.
Telangana: కలెక్టర్ ఏం చేస్తోంది.. భర్త పక్కన పడుకుందా.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
మళ్లీ ఆస్తులు కోరడం సరికాదు: సతీష్
వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికుండగానే జగన్, షర్మిలకు సమానంగా ఆస్తి పంపకాలు చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అన్నారు. జగన్‌కు బెంగుళూరులో ఇళ్ళు ఉందని షర్మిలకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇళ్ళు ఇచ్చారని తెలిపారు. వివాహం అయిన తర్వాత షర్మిల వాటాలు తీసుకొని మళ్ళీ ఆస్తులు కోరడం సమంజసం కాదన్నారు. జగన్ సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందారని తెలిపారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తండ్రికి దూరంగా ఉంటూ బెంగుళూరులో వ్యాపారం చేసుకున్నారన్నారు. రఘురాం సిమెంట్‌ను కొనుగోలు చేసి భారతి సిమెంట్స్‌ను ఏర్పాటు చేసుకున్నారన్నారు. షర్మిల ఆస్తుల్లో జగన్ వాటా అడగలేదని.. చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారన్నారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు షర్మిల ట్రాన్స్ఫర్ చేసుకున్నా రని సతీష్ రెడ్డి వెల్లడించారు.
కాగా.. ఇటీవల వైఎస్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా వైఎస్ కుటుంబ ఆస్తుల గొడవల నేపథ్యంలో షర్మిలను నిందిస్తూ సాక్షిలో గత వారం ఓ కథనం ప్రచురితమైంది. ఈ కథనాన్ని ఖండించడంతో పాటు వాస్తవాలు తెలియాలంటూ వైఎస్ అభిమానులకు షర్మిల లేఖ రాశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్థాపించిన అన్ని వ్యాపారాలూ కుటుంబ వ్యాపారాలేనని, అందులో తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానవాటా ఉండాలన్నది ఆయన ఆదేశమని తెలిపారు. అమ్మ కూడా కనీసం వెయ్యిసార్లు ఇదే విషయం చెప్పారని అన్నారు. వ్యాపారాలకు, ఆస్తులకు తన సోదరుడు జగన్ గార్డియన్ మాత్రమే అని తెలిపారు. ఆస్తులు ఎగ్గొట్టడానికి కన్న కొడుకే కేసులు పెట్టి కోర్టుకు లాగడంతో తన తల్లి విజయలక్ష్మి క్షోభకు గురవుతున్నారని షర్మిల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Govt: ధరల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Hyderabad: 'పాలు తాగే పిల్లాడున్నాడు.. వదిలేయండి ప్లీజ్'.. బెటాలియన్ పోలీసుల నిరసనల్లో తల్లి ఆవేదన
Read Latest AP News And Telugu News