AP Politics: ముస్లింలను వైసీపీ రెచ్చగొడుతోంది.. కిరణ్‌కుమార్‌రెడ్డి ఫైర్
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:47 PM
ఎన్నికల్లో ఓట్ల కోసం వైసీపీ ముస్లింలను రెచ్చ గొడుతోందని బీజేపీ (BJP) రాజంపేట ఎంపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు. బుధవారం నాడు మదనపల్లెలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా: ఎన్నికల్లో ఓట్ల కోసం వైసీపీ (YSRCP) ముస్లింలను రెచ్చగొడుతోందని బీజేపీ (BJP) రాజంపేట ఎంపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు. బుధవారం నాడు మదనపల్లెలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన నేతలతో ఉమ్మడి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... సీఏఏ (CAA) యాక్ట్ భారతీయులకు వర్తించదని.. పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. దేశంలోని ముస్లింలకు సీఏఏ వల్ల నష్టం జరగదని వివరించారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. తెనాలి పర్యటన రద్దు
ఎన్‌ఆర్సీ(NRC) వల్ల దేశ పౌరులకు నష్టం జరగదన్నారు. తాను సీఎంగా ఉన్నపుడు మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానని తెలిపారు. బాబ్రీ మసీదు స్థల వివాదంలో హిందూ దేవాలయానికి 2.74 స్థలం ఇస్తే, ముస్లిం మసీదు కోసం 5 ఎకరాల స్థలం కేటాయించారని చెప్పారు. దేశంలో అవినీతి లేని పాలన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే సాధ్యమని చెప్పారు.
Devineni Uma: ప్రచారానికి వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడి అమానుషం
బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకం కాదని అన్నారు. 6 ఇస్లామిక్ దేశాలు ప్రధాని మోదీకి గొప్ప అవార్డులు ఇచ్చాయని గుర్తు చేశారు. పదేళ్లు ఎంపీగా ఉన్న మిథున్‌రెడ్డి ఇసుక, లిక్కర్‌తో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారని ధ్వజమెత్తారు. మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మదనపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
AP Elections: జగన్‌కు ఓటమి భయం.. పెన్షన్ల పేరిట నీచ రాజకీయం..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి