AP News: నీట్ పేపర్‌లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆందోళన.. ఉద్రిక్తం
ABN , Publish Date - Jul 04 , 2024 | 11:58 AM
Andhrapradesh: నగరంలోని మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్, నెట్ పేపర్ లీకేజ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గురువారం నిరసన చేపట్టాయి. ఎస్ఎఫ్ఐ, పిడిఎస్‌యూ, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ..
విజయవాడ, జూలై 4: నగరంలోని మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ (Neet), నెట్ పేపర్ లీకేజ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు (Student Union) గురువారం నిరసన చేపట్టాయి. ఎస్ఎఫ్ఐ, పిడిఎస్‌యూ, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఎన్‌టీఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
CM Chandrababu: ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ.. ఏమేం చర్చించారు..!?
బీజేపీ ప్రభుత్వం (BJP Government) అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్షా పేపర్లు 66 సార్లు లీకేజీలు జరిగాయన్నారు. నీట్ పేపర్ లీకేజ్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని.. పేపర్ లీకేజ్‌కు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రవేశ పరీక్షల నిర్వహణను రాష్ట్రాలకు అప్పగించాలన్నారు. లక్షలాది రూపాలయతో ర్యాంకులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నీట్‌లో ఎన్ని అవకతవకలు జరిగినా కేంద్రం నుంచి స్పందన లేదని విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Peddirreddy : ఇంటి కోసం మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమించిన పెద్దిరెడ్డి..
YSRCP: ప్లీజ్.. ప్లీజ్ టీడీపీలోకి వచ్చేస్తాం.. వెంటపడుతున్న వైసీపీ నేతలు!
Read Latest AP News AND Telugu News