CM Chandrababu: ముగిసిన చంద్రబాబు సీ ప్లేన్ పర్యటన..
ABN , Publish Date - Nov 09 , 2024 | 07:10 PM
సీ ప్లేన్ సేవలకు భవిష్యత్తు బాగుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. సీ ప్లేన్ ల్యాండింగ్, టేకాఫ్ రెండూ భూమి మీద కంటే నీటిలో చాలా స్మూత్‍గా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీ ప్లేన్ పర్యటన ముగిసింది. శ్రీశైలం నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన సీ ప్లేన్‍లో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చేరుకున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానాన్ని ప్రకటిస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. పర్యాటక రంగానికి మంచి భౌవిష్యత్తు ఉందని, ప్రతి ఒక్కరూ సుందరమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నారని ఆయన చెప్పారు.
సీ ప్లేన్ సేవలకు భవిష్యత్తు బాగుంటుందని సీఎం చెప్పుకొచ్చారు. సీ ప్లేన్ ల్యాండింగ్, టేకాఫ్ రెండూ భూమి మీద కంటే నీటిలో చాలా స్మూత్‍గా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రకాశం బ్యారీజీ నుంచి శ్రీశైలం వరకూ తాను, రామ్మోహన్ నాయుడు సుందరమైన అనుభూతి పొందామని చెప్పుకొచ్చారు. ఈ తరహా విధానాలు చేపట్టి మార్కెటింగ్ చేసుకోవటంలో గత ప్రభుత్వం విఫలం అయ్యిందని ముఖ్యమంత్రి అన్నారు.
ఇకపై సుందరమైన ప్రదేశాలను గుర్తించి రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీ వనరుల్ని వినియోగించుకుంటూ ఈ రంగాన్ని ప్రోత్సహిస్తే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం చేకూరుతుందని చంద్రబాబు చెప్పారు. నెలకు రెండు, మూడు రోజులు సెలవు తీసుకుని పర్యాటకంగా విశ్రాంతి తీసుకుంటే ప్రజలందరి ఆరోగ్యం బాగుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: రెచ్చిపోతున్న కామాంధులు.. ఏపీలో మరో దారుణం..
CM Chandrababu: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
Read Latest AP News And Telangana News