Share News

AP News: బాబోయ్ ఇలా దోచేశారా? వెలుగు చూస్తున్న వైసీపీ అక్రమాలు..!

ABN , Publish Date - Jun 19 , 2024 | 03:44 PM

ఇందుగలదు అందు లేదన్నట్లుగా.. వైసీపీ(YSRCP) ప్రభుత్వం హయాంలో ఏ శాఖలో చూసినా అవినీతే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో(Andhra Pradesh Government) ప్రభుత్వం మారిన తరువాత గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.

AP News: బాబోయ్ ఇలా దోచేశారా? వెలుగు చూస్తున్న వైసీపీ అక్రమాలు..!
Andhra Pradesh

అమరావతి, జూన్ 19: ఇందుగలదు అందు లేదన్నట్లుగా.. వైసీపీ(YSRCP) ప్రభుత్వం హయాంలో ఏ శాఖలో చూసినా అవినీతే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో(Andhra Pradesh Government) ప్రభుత్వం మారిన తరువాత గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ పార్టీ కార్యక్రమాల కోసం వందల, వేల కోట్ల ప్రజా ధనాన్ని వినియోగించుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. వైసీపీ కోసం పని చేసిన వారికి.. ప్రభుత్వం తరఫున జీతాలు చెల్లించినట్లు తేలింది. వేలాది మందికి ప్రభుత్వం నుంచి లక్షల్లో జీతాలు చెల్లించినట్లు తాజా ప్రభుత్వం గుర్తించింది.


ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఈ-ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టారు. అయితే, ఈ 5 ఏళ్లు ఆఫీసుకు రాకుండా చాలా మందికి జీతాలు చెల్లించినట్లు తాజాగా గుర్తించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న వీరు.. పార్టీ కోసం సోషల్ మీడియాలో పని చేసినట్లు నిర్ధారించారు. తప్పుడు రిపోర్ట్‌లు, రికార్డులు సృష్టించి కార్పొరేషన్‌ల నుంచి జీతాలు చెల్లింపులు జరిపారు. కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. నాటి అక్రమ నియామకాలు, చెల్లింపులపై సమగ్ర వివరాలను సేకరిస్తోంది రాష్ట్రంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వం.


ఇప్పటికే పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై నివేదికలను సిద్ధం చేసింది. వైసీపీకి వర్క్ చేసిన వారికి.. ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లించి, అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేయడం, ఎక్కడెక్కడో ఉన్నవారి పేర్ల మీద జీతాలు ఇవ్వడంపై వివరాలు సేకరిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయిస్తోంది ఆంధ్రప్రదేశ్ కొత్త సర్కార్. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తేలితే.. కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 19 , 2024 | 03:44 PM