Flood Relief :: అకౌంట్లో పైసలు జమ కానీ వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ABN , Publish Date - Oct 07 , 2024 | 07:17 AM
ఆంధ్రప్రదేశ్లో గత నెలలో భారీ వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా విజయవాడలోని బుడమేరు ఉధృతంగా పొంగి ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీలను వరద ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో గత నెలలో భారీ వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా విజయవాడలోని బుడమేరు ఉధృతంగా పొంగి ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీలను వరద ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పరిశీలించారు. బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రత్యేక సహాయం చేస్తానని మాటిచ్చారు. చంద్రబాబు హామీ మేరకు ఇప్పటికే కొంతమంది బాధితుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి.
ఇవాళ(సోమవారం) వరదసాయం అందని మరికొంతమంది బాధితుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది. మిగిలిన 2 శాతం బాధితుల ఖాతాల్లో నేడు నగదును ఏపీ ప్రభుత్వం నగదు వేయనుంది. బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో నగదు జమకాలేదు. డీబీటీ పద్ధతిలో పరిహారం అందని వారికి ప్రభుత్వం ఈరోజు డబ్బులను ప్రభుత్వం జమ చేయనున్నంది. నేడు ఎన్టీఆర్ జిల్లాలో రూ. 15వేలు, అల్లూరి జిల్లాలో 4,620 బాధితులకు నగదు జమకానుంది. ఇప్పటికే 98 శాతం మంది వరద బాధితుల ఖాతాల్లో నష్టపరిహారం జమ అయిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
అంగళ్లులో రాళ్ల దాడి.. బాబుపై కేసు తప్పుడుదే!
CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగదు..
Kishan Reddy: గోవా రైలుకు పచ్చజెండా
Read Latest AP NEWS And Telugu News