Share News

YS Sharmila: ఈనెల 25నుంచి తలపెట్టే సమ్మెకు మద్దతు ఇవ్వండి: వైఎస్ షర్మిల

ABN , Publish Date - Nov 13 , 2024 | 07:33 PM

108 వాహనాల్లో డీజిల్ పోయకుండా, మెడికల్ ఎక్యూప్మెంట్ సమకూర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఆరోపించారు. వాహనాల్లో సమస్యలు వస్తే కనీసం రిపేర్ చేయించకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆమె మండిపడ్డారు.

YS Sharmila: ఈనెల 25నుంచి తలపెట్టే సమ్మెకు మద్దతు ఇవ్వండి: వైఎస్ షర్మిల
AP PCC chief YS Sharmila

విజయవాడ: 108 వ్యవస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగుల సమస్యలు తీర్చాలంటూ ఈనెల 25 నుంచి చేపట్టే సమ్మెకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల కోరారు. అపర సంజీవని 108 అంబులెన్స్‌లకు కూటమి ప్రభుత్వంలో ఆపద వచ్చిపడిందని ఆమె అన్నారు. ఫోన్ కొడితే "కుయ్ కుయ్" మంటూ క్షతగాత్రుల వద్దకు వెళ్లే ఆరోగ్య ప్రదాయిని మూగబోతుందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలకు అండగా నిలిచే ఈ వ్యవస్థను ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటున్నారని పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు.


108 వాహనాల్లో డీజిల్ పోయకుండా, మెడికల్ ఎక్యూప్మెంట్ సమకూర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. వాహనాల్లో సమస్యలు వస్తే కనీసం రిపేర్ చేయించకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఇంధనం లేదని గత నెల 140 వాహనాలను నిలిపివేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. 90 వాహనాలకు ఇప్పటికీ రిపేర్లు చేయాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానసపుత్రిక 108 అంబులెన్స్ అని షర్మిల చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ దూరదృష్టికి నిదర్శనం 108 వ్యవస్థ అని అన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలకు 108 వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని షర్మిల కొనియాడారు.


ఇలాంటి వ్యవస్థకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా గ్రహణం పడుతోందని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన సంజీవని 108ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆమె చెప్పారు. ఇవాళ (బుధవారం) 108 ఉద్యోగ సంఘాల నేతలు తమను కలిసినట్టు ఆమె తెలిపారు. ఈ వ్యవస్థ సమస్యల్ని ఉద్యోగులు తనకు వివరించారని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరు అధికారంలోకి వచ్చినా అంబులెన్స్ వ్యవస్థ ఆగకుండా ఉండాలంటే దీన్ని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తే బాగుంటుందని ఉద్యోగులు చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈనెల 25నుంచి తలపెట్టే సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. అంబులెన్స్‌లు ఆగితే నష్టం ప్రజలకే వాటిల్లుతుందని వైఎస్ షర్మిల తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Vijayawada: వైసీపీ నేత అరాచకం.. సంచలనంగా మారిన భూకబ్జా వ్యవహారం..

TEA: బీ కేర్ ఫుల్... టీ ఇన్ని కప్పులు తాగితే ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు..

KTR: పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్

Read latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 07:34 PM