YS Sharmila: తిరుమల కల్తీ లడ్డూపై షర్మిల వ్యాఖ్యల్లో అర్ధమేంటి.. వైసీపీని సమర్థిస్తున్నట్టా లేక..
ABN , Publish Date - Sep 20 , 2024 | 01:55 PM
Andhrapradesh: దేశ విదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. లడ్డూ ప్రసాదంలో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కలిసాయి అని చంద్రబాబు వెల్లడించారని.. ఇంత పెద్ద విషయం అంత సునయాసంగా ఎలా చెప్పారని ప్రశ్నించారు.
అమరావతి, సెప్టెంబర్ 20: తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చావు కబురు చల్లగా చెప్పినట్లు ఒక బాంబు పేల్చారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూలను జంతువుల నూనెతో తయారు చేస్తున్నారని అంటున్నారని... ఈ వ్యవహారంతో కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తారని తెలిపారు.
Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..
లడ్డూ ప్రసాదంలో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కలిశాయని చంద్రబాబు వెల్లడించారని, ఇంత పెద్ద విషయం అంత సునాయాసంగా ఎలా చెప్పారని షర్మిల ప్రశ్నించారు. ‘‘మీకు ముందుగానే తెలిస్తే ఎందుకు ఆలస్యంగా ఈ విషయం చెప్పారు. మీ 100 రోజుల సెలెబ్రేషన్స్‌లో చెప్పాలని ఆగారా..? ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్తున్నారు. మీ ఉద్దేశ్యం ఏమిటి?. 100 రోజుల పాలన సభలో వైసీపీపై విషం చిమ్మే ఉద్దేశ్యంలో భాగంగా చెప్పారా.. ఈ విషయంపై సీబీఐ ఎంక్వయిరీ జరగాలి.. తప్పు ఎవరు చేశారు అనేది తెలియాల్సిన అవసరం ఉంది. నిజంగానే తప్పు జరిగిందా.. లేక నిందలు వేస్తున్నారా... లడ్డూ విషయంలో కేంద్రానికి కి లేఖ రాశాను. తిరుమల లడ్డూ విషయంలో గవర్నర్‌ను కలుస్తాం’’ అని షర్మిల వెల్లడించారు.
వంద రోజుల పాలనపై..
చంద్రబాబు 100 రోజుల పాలన... శిశుపాలుడు తప్పులు చేసినట్లు జగన్ తప్పులను శ్వేతపత్రాల రూపంలో చూపారన్నారు. 100 రోజుల పాలనలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేశారని.. 100 రోజుల పాలన అంతా శూన్యమని వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల మోదీ ఆధ్వర్యంలో సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ దుయ్యబట్టారు. ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దింపి కూటమికి అధికారం ఇచ్చినప్పుడు ప్రజల ఆకాంక్ష నిలబెట్టుకోలేదని విమర్శించారు. సూపర్ సిక్స్ ఇప్పటికీ అమలు కాలేదు ఎందుకు సర్ అంటూ ప్రశ్నించారు. సూపర్ సిక్స్‌లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. 100 రోజుల్లోనే అన్ని అమలు చేయమని చెప్పలేదని.. కానీ ఒక్కటి కూడా ఆచరణలోకి రావటం లేదని వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ప్రతి మహిళకి ప్రతి నెల రూ.1500 ఇస్తానని అన్నారని.. ఏడాదికి మూడు సిలిండర్లు, ఉచిత బస్సు ఊసే లేదని విమర్శించారు. ప్రతి మహిళని ఒక శక్తిగా చేస్తానని చెప్పారన్నారు. మహిళలకు ఉచిత బస్సు చాలా చిన్న బడ్జెట్ పథకమని.. ఆగష్టు 15న అన్నారని... మళ్ళీ ఎప్పుడో అంటూ ఏపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు.
Note for Vote Case: ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట
అలా అనుకోవడం ఎంత వరకు కరెక్ట్
డబ్బులు లేవని సీఎం అంటున్నారని.. ఎన్నికల సమయంలోనే రాష్ట్ర బడ్జెట్ గురించి బాబుకు తెలుసని.. తెలిసే వాగ్దానలు ఇచ్చారన్నారు. 100 రోజుల్లో 100 విజయాలు అని ఎమ్మెల్యేలకు ఒక లిస్ట్ ఇచ్చారని.. బాధ్యతలు కూడా విజయాలు అనుకోవటం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. రాష్టానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి 10 ఏళ్ళు అవుతోందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రమే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు స్టీల్ ప్లాంట్‌పై స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్‌కు సొంత మైన్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘మాకు మెడికల్ సీట్లు వద్దు అనటం ఎంత వరకు కరెక్ట్... మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసే ఆలోచన మీకు ఉందా... చంద్రబాబు’’ అని ప్రశ్నించారు. వాలంటీర్లు అందరికి భద్రత కల్పించాలని కోరారు.
వైసీపీ అక్రమాలపై...
"ఉచిత ఇసుకలో ఉచితం పోయింది. రూ.99 కే మద్యం అంటున్నారు. మందుబాబులు హ్యాపీగా ఉన్నారు. కానీ మద్యం ఎంత ఎక్కువ అమ్మకాలు జరిగితే మహిళల భద్రతపై అంత ఆందోళన తలెత్తుతుంది. వైసీపీ విశ్వసనీయత కోల్పోయింది. ఆ పార్టీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. రాజశేఖర్‌రెడ్డి వ్యతిరేకించిన బీజేపీతో వైసీపీ అంటకాగింది" అని షర్మిల ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
YSRCP Attack: కంచికచర్ల ఘటన మరవక ముందే.. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు..
Narayana: ఇది లక్షల భక్తుల సమస్య.. సుప్రీం విచారణ చేయాలి
Read LatestAP NewsANdTelugu News