Share News

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు..

ABN , Publish Date - Aug 19 , 2024 | 01:59 PM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కర్ణాటకను ఆనుకుని ఉన్న తెలంగాణలో ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు (Three Days) భారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కర్ణాటకను ఆనుకుని ఉన్న తెలంగాణలో ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో ఐఎండీ రైన్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు తోడుగా గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రతగా ఉండాలని ఐఎండీ సూచించింది. పొలం పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని చెట్లకింద. బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఐఎండీ పేన్కొంది.


తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు..

ఢిల్లీలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు..

నిరుద్యోగులకు ఏపీలో మహర్దశ..

లిక్కర్ కేసులో కదులుతున్న డొంక..

ఆపరేషన్ హైడ్రా.. గండిపేటలో కూల్చివేతలు ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 19 , 2024 | 02:01 PM