Vijayawada: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ ఛైర్మన్..
ABN , Publish Date - Dec 03 , 2024 | 01:29 PM
ఏపీఎస్ ఆర్టీసీని తిరిగి లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. ఇందుకు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్లు, అధికారులతో కలిసి కార్యాచరణ రూపొందించినట్లు కొనకళ్ల వెల్లడించారు. ముందుగా దెబ్బతిన్న బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన చెప్పారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1,600 నూతన బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. వీటిలో ఇప్పటికే 900 బస్సులు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విజయవాడ బస్ డిపోలో నూతన బస్ సర్వీసులను కొనకళ్ల ప్రారంభించారు. కొత్తగా కొనుగోలు చేస్తున్న 1,600 బస్సులను రాష్ట్రవ్యాప్తంగా నడపనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ తెలిపారు.
లాభాల బాట పట్టిస్తాం..
ఆర్టీసీని తిరిగి లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కొనకళ్లు చెప్పారు. ఇందుకు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్లు, అధికారులతో కలిసి కార్యాచరణ రూపొందించినట్లు కొనకళ్ల వెల్లడించారు. ముందుగా దెబ్బతిన్న బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన చెప్పారు. ఏపీలో ఎలక్ట్రికల్ బస్సులను పెద్దస్థాయిలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
అప్పుడే ఉచిత ప్రయాణం..
మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ తెలిపారు. త్వరలోనే మహిళలకు శుభవార్త చెబుతామని ఆయన చెప్పారు. మరికొన్ని రోజుల్లో ఉచిత బస్సు పథకంపై విధివిధానాలు ప్రకటించి, పథకం అమలు చేస్తామని శుభవార్త చెప్పారు కొనకళ్ల. ప్రైవేటు బస్సులకు దీటుగా ప్రజలకు ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు.
సమస్యలు పరిష్కరిస్తాం..
ఆర్టీసీ కార్మికులకు సైతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారి సమస్యలను పరిశీలించి, ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరానికి కృషి చేస్తామని చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని కొనకళ్ల మండిపడ్డారు. ప్రస్తుతం సమస్యలన్నిటినీ పరిష్కరించి, ఆర్టీసీని లాభాల బాట పట్టించడమే తమ ప్రధాన ధ్యేయమని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Aliya Fakhri Arrest: బాలీవుడ్ నటి సోదరి అరెస్టు.. వివరాలు ఇవే..
Tamil Nadu: ఘోరం.. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన..
Visakha: విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య.. ఏం జరిగిందంటే..