AP Politics: ముగిసిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Feb 27 , 2024 | 05:41 PM
బీజేపీ(BJP) కోర్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్(Rajnath Singh) బీజేపీ నేతలకు, క్యాడర్‌కు దశా, దిశా నిర్ధేశించారు.
విజయవాడ: బీజేపీ(BJP) కోర్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్(Rajnath Singh) బీజేపీ నేతలకు, క్యాడర్‌కు దశా, దిశా నిర్ధేశించారు. టీడీపీ - జనసేన పొత్తుల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్ ప్రభుత్వం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని నేతలు రాజ్ నాధ్ సింగ్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బొమ్మలను కేంద్ర పథకాలపై వేయడం లేదని చెప్పారు. బియ్యం విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తోందని రాజ్ నాధ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. బీజేపీని ఏపీలో బలోపేతం చేసే దిశగా ప్రతిఒక్కరూ కష్టపడాలని చెప్పారు. కేంద్ర పథకాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని చెప్పారు. 2029లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ సైనికులు పనిచేయాలని రాజ్ నాధ్ సింగ్ సూచించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...